RBI Scheme For Children: బ్యాంకు ఖాతాలు ప్రతి ఒక్కరికి అవసరం. ఈ బ్యాంక్ అకౌంట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే పెద్దవారికి మాత్రమే కాదు పిల్లలకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. కానీ ఇన్ని రోజులు చాలా ఆంక్షలు ఉండేవి. కానీ ఇప్పుడు అందులో మార్పులు వచ్చాయి. అవేంటో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
సాధారణంగా పిల్లల పేరుతో ఖాతాలు తెరవరు, కానీ తీసుకోవడం కూడా చాలా మంచిది. పిల్లల పేరుతో ఖాతాలు తెరవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో, మీరు పిల్లల కోసం పెద్ద మొత్తంలో నిధులు సేకరించవచ్చు. దీనితో పాటు, స్కాలర్‌షిప్, ప్రోత్సాహక మొత్తం లేదా పాఠశాలల్లోని విద్యార్థులకు పిల్లలకు సంబంధించిన ఏదైనా పథకం మొత్తం నేరుగా వారి మైనర్ ఖాతాలోకి వస్తుంది. అదే సమయంలో, ఈ ఖాతా ద్వారా, మీరు పిల్లలకు పొదుపు అలవాటును పెంపొందించుకోవచ్చు. బ్యాంకుల్లో పిల్లల పేరుతో తెరిచిన ఖాతాను ‘మైనర్ ఖాతా’ అంటారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్ కోసం మైనర్ ఖాతాను తెరవవచ్చు.
అయితే ఇన్ని రోజులు పిల్లల ఖాతాలు తెరవాలంటే వారితో గైడ్ కచ్చితంగా ఉండాలి. అంటే తల్లిదండ్రులు కచ్చితంగా వారికి సపోర్ట్ గా ఉండాలి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. 10 సంవత్సరాల వయసు దాటిన పిల్లలు సొంతంగా వారే నేరుగా బ్యాంక్ కు వెళ్లి వారి ఖాతాను వారు ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు ఈ రూల్ ను ఆర్బీఐ తీసుకొని రాబోతుంది. ఇన్ని రోజులు వారికి బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసే అవకాశం ఉన్నా సరే 18 సంవత్సరాల వయసు వరకు గైడ్ ఉంటేనే బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగేది.
Also Read: RBI : తాజాగా ఎంపీసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బిఐ.. కోట్లాది మందికి ఊరట..
జులై 1వ తారీఖు నుంచి 10 సంవత్సరాల వయసు పైబడిన పిల్లలు వారే డైరెక్ట్ గా బ్యాంకుకు వెళ్లి గార్డియన్ అవసరం లేకుండా బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు వారే వారి అకౌంట్ ను ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం మాత్రమే కాదు. వారికి బ్యాంక్ డెబిట్ కార్డును, పాస్ బుక్ తో పాటు చెక్ బుక్ ను కూడా అందిస్తుంది. ఈ చెక్ లను పిల్లలు ఉపయోగించుకోవచ్చు కూడా. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించే ఫెసిలిటీ కూడా కల్పిస్తుంది ఆర్బీఐ.
పిల్లల వయసును బట్టి కొన్ని నియమాలు ఉంటాయి. లిమిట్స్ ఉంటాయి. ఇక మీ పిల్లల వయసు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే మాత్రం మీరే గార్డెన్ గా ఉండాలి. అంటే పాత రూల్ అన్నమాట. కానీ ఈ కొత్త రూల్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అంటున్నారు కొందరు తల్లిదండ్రులు. మొత్తం మీద ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ అవకాశం ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.