RBI: ప్రస్తుతం కాలంలో Money Transfer కోసం Mobilesనే ఎక్కువగా వాడుతున్నారు. కూరగాయలు అమ్మే వారి నుంచి పెద్ద వ్యాపారులు సైతం చేతిలోని ఫోన్ ద్వారా ట్రాన్జాక్షన్ జరుపుతున్నారు. మొబైల్ ఉండే ఫోన్ పే లేదా గూగుల్ పే లోని యూపీఐ కోడ్ ద్వారా ఈ మనీని సెండ్ చేస్తుంటారు. ఇతరులకు డబ్బులు పంపించే క్రమంలో ఒక్కోసారి నెంబర్ తప్పు పడి లేదా అనుకున్న వారికి కాకుండా ఇతరులకు డబ్బులు వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్లిన డబ్బలు తిరిగి రావడం కష్టంగా మారుతుంది. అయితే మనీ సెండ్ చేసే క్రమంలో వారి పేరు పడిన తరువాతే డబ్బులు పంపిస్తారు. ఈ సదుపాయం యూపీఐలో మాత్రమే ఉంది. కానీ RTGS, Neft ద్వారా డబ్బులు పంపించాలనుకునేవారికి ఈ సదుపాయం లేదు. మరి ఇప్పుడేం చేశారంటే?
సాధారణంగా IMPS లేదా యూపీఐ ద్వారానే ఎక్కువ మంది డబ్బులు పంపిస్తూ ఉంటారు. మనీ యాప్ ద్వారా డబ్బులు పంపించే క్రమంలో వారి మొబైల్ నెంబర్ లేదా.. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయగానే వారి పేరు పడుతుంది. అలా నిర్దారించుకున్న తరువాతే నగదును పంపిస్తారు. ఎందుకంటే పేరు పడని క్రమంలో వారి అకౌంట్ అవునో? కాదోననే అనుమానం వస్తుంది. ఈ విధానంలో ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ RTGS, Neft కూడా చాలా మంది డబ్బులు పంపిస్తూ ఉంటారు. కానీ వీరికి ఈ సదుపాయం లేదు.
RTGS, Neft ద్వారా డబ్బులు పంపించాలని అనుకునే వారు ముందుగా.. అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేస్తారు. ఆ తరువాత IFSC కోడ్ ఎంటర్ చేస్తారు. ఇలా చేసినా ఎదుటివారి పేరు పడదు. ఈ క్రమంలో అకౌంట్ నెంబర్ ఒక్కోసారి మిస్ అయితే ఈ డబ్బలు వేరే వాళ్లకు వెళుతూ ఉంటాయి. ఇలా ఇప్పటి వరకు చాలా సంఘటనలు జరిగాయి. ఈ ఇబ్బందులను గుర్తించిన Reserve Bank Of India కొత్త విధానాన్ని అందుబాటులోకి తసుకొచ్చింది. దీనిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనుంది.
ఇక నుంచి RTGS, Neft ద్వారా డబ్బలుు పంపించాలనుకునేవారికి సైతం అకౌంట్ నెంబర్, IFSC కోడ్ ఎంటర్ చేయగానే.. వారి పేరు డిస్ ప్లే అవుతుంది. దీంతో మనం డబ్బులు కరెక్ట్ గానే పంపిస్తున్నామా? లేదా? అని తెలిసిపోతుంది. ఆ తరువాత వెంటనే వారి అకౌంట్లోకి మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. దీంతో ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఎవరైనా దీనిని ఫాలో అయితే వారికి పేరు డిస్ ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కోసారి తొందర్లోనూ కొందరు అకౌంట్ నెంబర్ రాంగ్ గా ఎంటర్ చేసి డబ్బులు పంపించే అవకాశం ఉంది. అయితే అకౌంట్ నెంబర్ సరిగ్గా ఎంటర్ చేసిన తరువాతనే డబ్బులు పంపించుకోవాలి. ఒకవేళ సరైనవారికి డబ్బులు పంపించాక కూడా వారికి చేరలేకపోతే .. ఆ తరువాత బ్యాంకునెు సంప్రదించి సమస్యను వివరించాలి. ఎందుకంటే ఒక్కోసాని మన సెండ్ అయినట్లుగా మెసేజ్ వచ్చి.. మధ్యలో స్ట్రక్ అవుతుంది.