Acidity Problem: వేసవి కాలంలో ఎక్కువమందిని వేధించే ఆరోగ్య సమస్యలలో ఎసిడిటీ సమస్య ఒకటనే సంగతి తెలిసిందే. మసాలా, నూనెలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ ఆరోగ్య సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎసిడిటీ సమస్య వేధించే వాళ్లు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు.

మసాలా, నూనెలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బ తినే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ గా ఉంటే తరచూ ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఎసిడిటీ సమస్యతో బాధపడేవాళ్లు శరీరానికి అవసరమైన స్థాయిలో నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.
Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి నోట మాట రాని డిస్ట్రిబ్యూటర్స్?
ఎసిడిటీ సమస్యతో బాధపడే వాళ్లు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లలో శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ యాసిడ్ రిఫ్లక్స్ పుష్కలంగా ఉంటాయి. పండ్లు తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. పుచ్చకాయ తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటు గ్యాస్, ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయని చెప్పవచ్చు.
వేసవిలో పాలు తీసుకోవడం ద్వారా ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. చల్లని పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. వేసవిలో అరటిపండ్లు తీసుకోవడం ద్వారా కూడా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మజ్జిగ తీసుకోవడం ద్వారా కూడా ఎసిడిటీ సమస్య సులువుగా దూరమవుతుంది. కొబ్బరి నీళ్లు, అరటిపండ్లు కూడా ఎసిడిటీ సమస్యను దూరం చేస్తాయి.
Also Read: Sarkaru Vaari Paata: సర్కారువారి పాటను వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్.. మహేష్ బ్రేక్ చేస్తాడా..?