Safe App: Technology పెరుగుతున్న కొద్దీ పనులు ఈజీ అవుతున్నాయి. ఇదే సమయంలో సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఈరోజుల్లో చాలా పనులు యాప్ లతోనే చేసేస్తున్నారు.ఒక్క యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సకల పనులు అవుతున్నాయి. అయితే ఇదే తరుణంలో కొందరు సైబర్ నేరగాళ్లు ఫేక్ యాప్ లను సృష్టిస్తూ మొబైల్ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నారు. కొన్ని యాప్ లను సృష్టించి ఆ లింక్ లను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిని ఓపెన్ చేయగానే యూజర్ల బ్యాంకు అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. ఇంతకీ ఆ యాప్ ఏంటి? దీనిని ఎవరు గుర్తించారు?
గతంలోనూ చాలా లింక్స్ వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ద్వారా సర్క్యూలేట్ అయ్యాయి. వీటిని ఓపెన్ చేయడం ద్వారా అనేక సమస్యలు ఎదురయ్యాయి. అయితే తాజాగా ఓ యాప్ ను క్రియేట్ చేశారు.ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మీ ఫైల్స్ సేఫ్ గా ఉంటాయని చెబుతూ దానికి ‘సేఫ్ యాప్’ అని పేరు పెట్టారు. అయితే దీని పేరుతో ఫేక్ పుట్టుకొచ్చింది ఈ యాప్ ఇన్ స్టాల్ చేసినప్పుడు వ్యక్తిగత డేటా రిక్వైర్ చేస్తుంది. ముందుగా వాట్సాడ్ డిటేయిల్స్ ఇవ్వమని అడుగుతుంది ఆ తరువాత ఇన్ స్టాల్ చేసు క్రమంలో ‘అలో’అ నే పర్మిషన్ అడుగుతుంది. అలో చేయగానే ఫోన్లోని కాంటాక్ట్, ఇతర వివరాలు అడుగుతుంది.
ఆ తరువాత ఫోన్లోని డేటా మొత్తం హ్యాకింగ్ కు గురవుతుంది. దీని ద్వారా స్మార్ట్ ఫోన్ లోకి స్పై వేర్ ఎంట్రీ ఇచ్చి డివైజ్ మొత్తాన్ని హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇలా కీలక డేటాను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత ఓటీపీ నెంబర్లు పంపించి టైప్ చేయమని అడుగుతారు. కొందరు అవగాహన లేనివారు అలా టైప్ చేయడం ద్వారా తమ అకౌంట్లోని డబ్బంతా లాగేసుకుంటారు. ఇదే కాకుండా వాట్సాప్ లోని డేటాను హ్యాక్ చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తారు.
వాస్తవానికి ఒరిజినల్ ‘సేఫ్ యాప్’ తరహాలోనే ఇది కూడా పనిచేస్తుంది. దీనిని మొదటిసారిగా ‘సైఫర్మా’ అనే సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ గుర్తించింది. అయితే ఒరిజినల్, ఫేక్ రెండింటలో తేడాను ప్రస్తుతానికైతే గుర్తించలేమని కొందరు నిపుణులు అంటున్నారు. ఏదీ ఏమైనా ‘సేప్ యాప్’విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మోసం అయ్యే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.