https://oktelugu.com/

Karan Johar: మా అమ్మకు లోదుస్తులు నేనే కొంటా… స్టార్ ప్రొడ్యూసర్ పచ్చి కామెంట్స్

81 ఏళ్ల మా అమ్మ ఏది అడిగినా నేనే స్వయంగా తెస్తానని కరణ్ జోహార్ అన్నారు. మీడియా ఎదుట కరణ్ జోహార్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కరణ్ జోహార్ కి పెళ్లి కాలేదు.

Written By:
  • Shiva
  • , Updated On : August 4, 2023 / 11:41 AM IST

    Karan Johar

    Follow us on

    Karan Johar: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తీరే వేరు. ఆయన యాటిట్యూడ్ కొంచెం బోల్డ్ గా ఉంటుంది. లవ్ ఎఫైర్, శృంగారం గురించి మాట్లాడేందుకు అసలు సిగ్గుపడదు. కాఫీ విత్ కరణ్ షోకి హోస్ట్ గా ఉన్న కరణ్ జోహార్ బాలీవుడ్ సెలెబ్స్ తో పచ్చిగా మాట్లాడతారు. పెళ్లి కానీ హీరోలు, హీరోయిన్స్ ని కూడా శృంగారం చేశారా? అని అడుగుతాడు. కరణ్ జోహార్ కామెంట్స్ పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా ఆయన తల్లి గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

    రాకీ ఔర్ రాణీకి ప్రేమ కహానీ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న కరణ్ జోహార్ వ్యక్తిగత విషయాల మీద స్పందించారు. మా అమ్మకు ఏది కావాలన్నా నేనే కొంటాను. చివరికి లో దుస్తులు కూడా. నా మిత్రులు ఈ విషయాన్ని తప్పుగా చూస్తారు. ఆ పని నువ్వు చేయకపోతే ఎవరికైనా చెప్పొచ్చుగా అంటారు. మా అమ్మ నాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా చెప్పింది. నేను ఆ పని మరొకరికి ఎందుకు పురమాయించాలి. ఆమె సిగ్గుపడకుండా చెప్పారు. నిజానికి ఇది చెడ్డ విషయం కాదన్నారు.

    81 ఏళ్ల మా అమ్మ ఏది అడిగినా నేనే స్వయంగా తెస్తానని కరణ్ జోహార్ అన్నారు. మీడియా ఎదుట కరణ్ జోహార్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కరణ్ జోహార్ కి పెళ్లి కాలేదు. సరోగసి ద్వారా ఇద్దరు పిలల్లకు తండ్రి అయ్యాడు. అతడు గే అనే వాదన ఉంది. ఇటీవల ఓ నెటిజెన్ మీరు గేనా అని అడిగాడు. దానికి స్పందనగా నీకు ఇంట్రెస్ట్ ఉందా అని రిప్లై ఇచ్చాడు.

    ఇక కరణ్ జోహార్ నిర్మాతగా ఉన్న రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ పర్లేదు అనిపిస్తుంది. మెల్లగా పుంజుకుంటుంది. గత వారం విడుదలైన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ మూవీ రూ. 75 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచర్మం. త్వరలో వంద కోట్ల మార్క్ చేరుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా తెరకెక్కింది. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్ర బడ్జెట్ రూ. 250 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది.