Positive Thinking vs Negative Thinking: ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.. కానీ ఆ సంతోషం ఎప్పటికీ పక్కనే ఉన్న దానిని పట్టించుకోకుండా.. బాధ కావాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు. అంటే కొందరు ఏ బాధ.. ఎలాంటి కష్టం లేకుండా తమకు అన్ని కష్టాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఇలా నిత్యం చెప్పడం వల్ల వారికి అప్పటి వరకు కష్టం లేకున్నా.. అప్పటినుంచి బాధలు మొదలవుతాయని కొందరు ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. ఎందుకంటే సంతోషం కోరుకునే వారిలో భగవంతుడు జీవిస్తాడు.. దుఃఖం కావాలని అనుకునే వారిలో కష్టాలేమి ఉంటాయని అంటున్నారు. అయితే సంతోషంగా ఉండడానికి ఏ విధంగా ప్రవర్తించాలి? ఎవరితో ఎలా ఉండాలి?
కొందరికి కావలసిన డబ్బు అందుబాటులో ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అందమైన జీవితం సాగుతూ ఉంటుంది. కానీ ఎవరైనా తమకు ఎదురైన సందర్భంలో మీ జీవితం ఎలా ఎలా ఉంది? అని అడిగితే మాత్రం తమ జీవితంలో అన్నీ కష్టాలే అని చెబుతూ ఉంటారు. కొన్ని బాగున్నా మిగతావన్నీ ఎక్కువగా బాధపెడుతున్నాయని ఆవేదన చెందుతారు.
ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలతో పాటు దుఃఖాలు కూడా ఉంటాయి. కానీ చాలామంది తమ సంతోషం గురించి కాకుండా కష్టాలు, దుఃఖం గురించే ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఎందుకంటే తాము బాగున్నామని ఎదుటివారికి చెబితే ఓర్వలేక పోతారని.. అలాగే ఏడుపు ఉంటుందని భావిస్తారు. అందువల్ల తమకు అన్ని కష్టాలే అని చెబుతారు. కానీ వాస్తవానికి సంతోషంగా ఉన్నామని చెప్పే వారిలో దేవుడు కొలువై ఉంటాడని అంటున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి తనకున్న సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అక్కడున్న వాతావరణం అంతా పాజిటివ్ గా మారిపోతుంది. ఇదే సమయంలో అంతా మంచి మాటలే వినిపిస్తాయి. మంచి పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా కాకుండా నెగటివ్గా ప్రవర్తిస్తే.. వాతావరణం అంతా కలుషితమైపోతుంది.
Also Read: Corona Positive To Niktha Dutta: ప్రముఖ నటికి కరోనా.. సినీ ఇండస్ట్రీలో కలకలం
అందువల్ల సంతోషంగా ఉన్నవారు సంతోషంగా ఉన్నామని చెప్పాలి. అలా చెబితే వారితోపాటు ఎదుటి వారు కూడా మనసు ప్రశాంతంగా మారుతుంది. అలా కాకుండా తమకు కష్టాలు ఉన్నాయని చెబితే ఎదుటివారు సింపతి చూపించడం తప్ప ఏ విధంగా సాయం చేయలేరు. అంతేకాకుండా వీరికి ఉన్న కష్టాల గురించి వారు ఊరంతా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలా ప్రచారం చేయడం వల్ల సమాజంలో గుర్తింపు ఏర్పడడంలో అడ్డాకును ఏర్పడతాయి. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఎప్పుడూ నెగిటివ్గా ఉంటారని భావన ఎదుటివారిలో ఏర్పడి అవకాశాలు ఇవ్వడానికి వెనుకడతారు. అలా కాకుండా నిత్యం సంతోషంగా ఉండగలిగే వ్యక్తులకు, పాజిటివ్గా మాట్లాడే వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గ్రహించాలి.
అందువల్ల ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక ప్రకారం కొన్ని లేని కష్టాలు చెప్పుకున్నప్పుడు పైన తధాస్తు దేవతలు ఉంటారని అంటారు. ఆ విధంగానూ లేని కష్టాలను కోరుకున్నట్లే అవుతుందని చెబుతున్నారు. ఒక వ్యక్తి తాను ఎలా ఆలోచిస్తే జీవితం కూడా అలాగే ఉంటుందని పేర్కొంటున్నారు.