Pomegranate: మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో దానిమ్మ ఒకటనే సంగతి తెలిసిందే. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో దానిమ్మ పండ్లు తోడ్పడతాయి. శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ దానిమ్మ పండ్ల ద్వారా లభిస్తాయి. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. కీళ్లనొప్పులకు చెక్ పెట్టడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో దానిమ్మ తోడ్పడుతుంది.
దానిమ్మ పండ్లు క్యాన్సర్ కు చెక్ పెట్టడంలో కూడా సహాయపడతాయి. దానిమ్మ పండ్లు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని చెప్పవచ్చు. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేయడంలో దానిమ్మ పండ్లు ఉపయోగపడతాయి. దానిమ్మ పండ్లు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అల్జీమర్స్ తో బాధపడే వాళ్లు దానిమ్మ పండ్లు తినడం ద్వారా ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు.
అయితే రైతులు దానిమ్మను సాగు చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. సీజన్ తో సంబంధం లేకుండా దానిమ్మకు డిమాండ్ ఉంటుంది. దానిమ్మ చెట్టు జీవితకాలం 25 సంవత్సరాలు కాగా మొక్క నాటిన నాలుగు సంవత్సరాలలో ఫలాలు వస్తాయి. ఉప-ఉష్ణమండల వాతావరణం దానిమ్మ మొక్కలు పెరగడానికి అనుకూల వాతావరణం అని చెప్పవచ్చు. దానిమ్మ విత్తనాలు గులాబీ రంగులో ఉంటాయి.
దానిమ్మ సాగు చేయడం ద్వారా అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఇసుక నేలలు, నీటి పారుదల ఉన్న నేలలు ఈ పంటకు అనుకూల నేలలని చెప్పవచ్చు. సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యలో దానిమ్మ మొక్కలను నాటడానికి అనుకూల సమయమని చెప్పవచ్చు.
[…] Chandrababu Naidu: కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చడానికి సంకల్పించింది. ఇందులో భాగంగా ఏపీకి రావాల్సిన న్యాయమైన హక్కులు ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఇన్నాళ్లు ఏపీకి రావాల్సిన నిధులపై సీఎం జగన్ ఎన్నోమార్లు కేంద్రాన్ని కోరారు. దీనిపై ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వచ్చిన ప్రభుత్వం పార్లమెంట్ లోప్రధాని ప్రసంగం నేపథ్యంలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పనిలో పడింది. ఇప్పటికే టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావించింది. దీంతో టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని ప్రణాళిక రచిస్తోంది. దీని కోసమే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని చూస్తోంది. […]