PMEGP Scheme: జీవితంలో ఆర్థికంగా ఎదగాలనుకునేవారికి ఉద్యోగం, వ్యాపారం అనే రెండు దారులు ఉంటాయి. కొంతమంది ఉద్యోగం అంటే ఇష్టపడుతారు. కానీ చాలా మంది ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక సొంతంగా వ్యాపారం చేయడానికి ఇష్టపడుతారు. అయితే తగిన పెట్టుబడి, సరైన ప్రోత్సాహం లేకపోవడంతో వెనుకడుగు వేస్తారు. వ్యాపారం చేయడానికి సరైన ఆలోచనలు ఉన్నా.. ఫైనాన్షియల్ సపోర్టు లేకపోవడంతో నిరాశ చెందుతారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో రాణించాలనుకున్న యువతకు ఇలాంటి పరిస్థితులు తమ జీవితాలను ఆగమ్యగోచర స్థితిలో పడేస్తాయి. అయితే వీరికి కేంద్ర ప్రభుత్వం సువర్ణ అవకాశం ఇచ్చింది. వ్యాపారం చేయడానికి అవసమైన పెట్టుబడిని అందిస్తుంది. అంతేకాకుండా అందులో 25 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా..
వ్యాపారం చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిని ఇచ్చేందుకు పలు పథకాలు ప్రవేశపెట్టింది. అయితే ఇవి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేవారికి మాత్రమే అనుగుణంగా ఉండేది. కానీ తాజాగా చిన్న, మధ్య తరహా వ్యాపారం చేయాలనుకునేవారికి కేంద్రం ఓ పథకాన్ని అందుబాటులో ఉంచింది. అదే ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రొగ్రాం(పీఎంఈజీపీ).ఈ పథకం గురించి చాలా మందికి తెలిసినా ఇందులోని పూర్తి వివరాలు తెలియక చాలా మంది పట్టించుకోవడం లేదు.
ఔత్సాహిక వ్యాపార వేత్తలకోసం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద వ్యాపారం చేయాలనుకునేవారికి అవసరమైన మేరకే లోన్ ఇస్తుంది. అలాగే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా చేయూతనిస్తుంది. నేషనల్ లెవల్ లో నోడల్ ఏజేన్సీ ఈ పథకాన్ని నిర్వహిస్తుంది. రాష్ట్రస్థాయిలో కేవీఐసీ, కేవీఐబీలు, జిల్లా స్థాయిలో జిల్లా పరిశ్రమల కేంద్రం దీనిని నిర్వహిస్తుంది. ఈ పథకం ద్వారా లభించే లోన్ ద్వారా చిన్న తరహా పరిశ్రమలు కూడా ప్రారంభించవచ్చు.
పీఎంఈజీపీ కింద ప్రారంభంలో రూ.10 లక్షల వరకు లోన్ ఇస్తారు. సేవా రంగం పరిశ్రమలకు రూ.25 లక్షలు, తయారీ రంగానికి రూ.50 లక్షలు ఇస్తారు. ఇందులోగ్రామీణ ప్రాంతాలల్లోని జనరల్ కేటగిరి వారికి సైతం 25 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 35 శాతం సబ్సిడీని ఇస్తోంది. దేశ వ్యాప్తంగా 27 బ్యాంకులు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తన్నాయి.
కొత్తగా పరిశ్రమ మొదలు పెట్టాలనుకునేవారికి పీఎంఈజీపీ మంచి అవకాశం అని చాలా మంది అంటున్నారు. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలనే డౌట్ చాలా మందిలో ఉంది. ఇందులో కోసం కేవీఐసీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలి. అందుకు సంబంధించిన కొన్ని డాక్యమెంట్లు సమర్పిస్తే సరిపోతుంది. వాటిని పరిశీలించిన తరువాత మీకు కావాల్సిన మొత్తాన్ని బ్యాంకులో జమచేస్తారు.
ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులు, పెరుగుతున్న నిరుద్యోగిత కారణంగా ఉద్యోగాల కోసం ఎదురుచూసే కంటే సొంతంగా వ్యాపారం చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని సూచిస్తున్నారు. ముఖ్యంగా యువత ను దృష్టిలో ఉంచుకొనే ఈ సబ్సిడీ సౌకర్యాన్ని కల్పించారని అంటున్నారు. అందువల్ల ఔత్సాహిక యువతీ, యువకులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రుణంతో పాటు సబ్సిడీని పొంది ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చుకోవాలని అంటున్నారు.