Free Gas Cylinder: దేశంలో రోజురోజుకు వంట గ్యాస్ సిలిండర్లను వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఇంట్లో కట్టెల పొయ్యి లేకుండా గ్యాస్ సిలిండర్ ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్లు సులభంగా గ్యాస్ కనెక్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం మహిళా సంఘాలకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను అందిస్తోంది.

ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం అమలులో భాగంగా కేంద్రం కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందించడానికి సిద్ధమైంది. గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్లను అందిస్తుండటం గమనార్హం. సాధారణంగా కొత్త గ్యాస్ సిలిండర్ కావాలంటే 3,200 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే 1,600 రూపాయలు సబ్సిడీ పొందవచ్చు.
మరోవైపు గ్యాస్ కంపెనీలు మిగిలిన 1,600 రూపాయలు చెల్లిస్తాయి. అయితే గ్యాస్ కంపెనీలు చెల్లించిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 2016 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. https://pmujjwalayojana.com వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. మహిళలు ఫ్యామిలీ డిక్లరేషన్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
కుటుంబంలో ఎవరి పేరుపై ఎల్పీజీ కనెక్షన్ ఉండకపోతే మాత్రమే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందడం సాధ్యమవుతుంది. దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకుని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో సమర్పించాల్సి ఉంటుంది.