https://oktelugu.com/

Pine Apple Dating: సరికొత్త ట్రెండ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పైనాపిల్ డేటింగ్‌!

ప్రస్తుతం బయట పైనాపిల్ డేటింగ్ అనేది బాగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ డేటింగ్ స్పెయిన్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఇంతకీ పైనాపిల్ డేటింగ్ అంటే ఏమిటి? యువత ఎందుకు ఈ డేటింగ్‌లకు ఎట్రాక్ట్ అవుతున్నారు? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్టోరీ ఆలస్యం చేయకుండా స్టోరీ చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 19, 2024 / 03:08 AM IST

    Pine apple Dating

    Follow us on

    Pine Apple Dating: ప్రస్తుతం అంతా డిజిటల్ అయిపోయింది. ఆఖరికి పెళ్లి సంబంధాలు కూడా ఆన్‌లైన్‌లో చూసి, పెళ్లి చూపులు, ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోతుంది. అయితే ఈ కాలం యువతకి డేటింగ్ గురించి బాగా తెలుసు. డేటింగ్ యాప్స్ వాడటం, సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన వారితో డేటింగ్ చేయడం వంటివి చేస్తున్నారు. మన దేశంతో పోలిస్తే మిగతా దేశాల్లో అయితే ఇది కామన్. ఈ మధ్య కాలంలో అయితే సరికొత్త డేటింగ్‌ ట్రెండ్ నడుస్తోంది. ప్రస్తుతం బయట పైనాపిల్ డేటింగ్ అనేది బాగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ డేటింగ్ స్పెయిన్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఇంతకీ పైనాపిల్ డేటింగ్ అంటే ఏమిటి? యువత ఎందుకు ఈ డేటింగ్‌లకు ఎట్రాక్ట్ అవుతున్నారు? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్టోరీ ఆలస్యం చేయకుండా స్టోరీ చదివేయండి.

     

    మనస్సులోని భావాలను ఒక వ్యక్తితో పంచుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలో వారికి కావాల్సిన పార్ట్‌నర్ గురించి వెతుకుతుంటారు. అయితే ఒకప్పటి రోజుల్లో పార్ట్‌నర్‌ను డైరెక్ట్‌గా వెతికేవారు. కానీ ఇప్పటి రోజుల్లో అంతా డిజిటల్ కావడంతో ఆన్‌లైన్‌లోనే వెతుకుతున్నారు. ఇలా డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నారు. అయితే ప్రస్తుతం స్పెయిన్‌లో పైనాపిల్ డేటింగ్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. పార్ట్‌నర్‌ను డేటింగ్ యాప్‌లో వెతికే ట్రెండ్ కాస్త ముగిసిందనే అనుకోవాలి. ఎందుకంటే ఈ పైనాపిల్ డేటింగ్ ట్రెండ్ సూపర్ మార్కెట్‌లో మొదలైంది. స్పెయిన్‌లోని మెర్కాడోనా ప్రాంతంలోని ప్రజలు కావాల్సిన వస్తువులు ఈ సూపర్ మార్కెట్‌లోనే కొంటారు. అయితే పార్ట్‌నర్‌ను కూడా ఇదే మార్కెట్‌లో వెతుక్కోవచ్చు. మీకు నచ్చిన వ్యక్తితో డేటింగ్ చేయాలనుకుంటే ఈ సూపర్ మార్కెట్ ద్వారా చేయవచ్చు.

     

    కోరుకున్న పార్ట్‌నర్ కావాలనుకునే వారు ఈ సూపర్ మార్కెట్‌కి వెళ్లి షాపింగ్‌ కార్ట్‌లో ఉన్న ఒక పైనాపిల్‌ను తలకిందులుగా ఉంచుతారు. అలా ఎవర పెడతారో వారు సింగిల్ అని అర్థం. ఆ పైనాపిల్‌ను చూసి.. ఆమె పార్ట్‌నర్ కోసం వెతుకుతుందని భావిస్తారు. ఆమెను నచ్చిన వ్యక్తి పైనాపిల్‌కు రియాక్ట్ అయ్యి పైనాపిల్‌ను తల కిందులుగా పెడతాడు. ఎవరైతే మొదటిగా పైనాపిల్‌ను తల కిందులుగా పెడతారో వారు కలిసి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత డేటింగ్ ప్రారంభిస్తారు. ఇలా డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే వివాహం చేసుకుంటారు. అయితే ఇక్కడ కేవలం ఈ పైనాపిల్ డేటింగ్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయట. షాపింగ్ కార్ట్‌లో నుంచి చాక్లెట్లు లేదా స్వీట్లు పెడితే కేవలం కొన్ని రోజులకు మాత్రమే రిలేషన్ కాకుండా జీవితాంతం కోరుకుంటున్నారని అర్థం. ఇలా ఒకటేంటి.. చాలా రకాల ట్రెండ్‌లు ఉన్నాయట. అయితే మన దేశంలో కేవలం డేటింగ్, లివింగ్, డేటింగ్ యాప్స్ ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. కానీ ఇతర దేశాల్లో కొత్త కొత్త ట్రెండ్‌లు నడుస్తున్నాయి. మరి ఈ పైనాపిల్ డేటింగ్ ట్రెండ్‌పై మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల యువతకు నష్టాలేంటి? అనే విషయం కామెంట్ చేయండి.