Homeలైఫ్ స్టైల్Phone Hacked Signs: మీ ఫోన్ లో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే హ్యాక్ అయినట్లే..!

Phone Hacked Signs: మీ ఫోన్ లో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే హ్యాక్ అయినట్లే..!

Phone Hacked Signs: ప్రస్తుత కాలంలో వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలు, ఫొటోలు, ముఖ్యమైన పత్రాల వరకు అన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే భద్రపరిచే పరిస్థితి ఉంది. అందుకే స్మార్ట్‌ఫోన్ భద్రత అత్యంత కీలకంగా మారింది. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా ఫోన్లను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితేఫోన్ హ్యాక్ అయిందో లేదో కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే గుర్తించే అవకాశం ఉందని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు.

ఫోన్ ఎక్కువగా వేడెక్కడం లేదా బ్యాటరీ వేగంగా ఖాళీ కావడం:
ఫోన్ ను పెద్దగా ఉపయోగించకపోయినా ఫోన్ అసాధారణంగా వేడెక్కడం లేదా బ్యాటరీ చాలా వేగంగా తగ్గిపోవడం గమనిస్తే అప్రమత్తం కావాలి. హానికరమైన సాఫ్ట్‌వేర్ (మాల్వేర్) నేపథ్యంలో నిరంతరం పనిచేస్తూ ప్రాసెసర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. కొత్త బ్యాటరీ పెట్టినా లేదా ఫోన్ కొత్తదైనా ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఫోన్‌ను పూర్తిగా స్కాన్ చేయించడం మంచిది.

అకస్మాత్తుగా డేటా వినియోగం పెరగడం:
ఇంటర్నెట్‌ను సాధారణంగానే ఉపయోగిస్తున్నప్పటికీ మొబైల్ డేటా వినియోగం ఒక్కసారిగా పెరిగితే అది అనుమానించాల్సిన విషయమే. కొన్ని హ్యాకింగ్ యాప్‌లు లేదా మాల్వేర్‌లు మీ ఫోన్‌లోని సమాచారం, ఫొటోలు లేదా ఇతర డేటాను రహస్యంగా సర్వర్లకు పంపిస్తుంటాయి. దీంతో మీ డేటా వినియోగం అనూహ్యంగా పెరుగుతుంది. అందువల్ల డేటా వినియోగాన్ని తరచూ పరిశీలించడం అవసరం.

తెలియని మెసేజ్‌లు లేదా OTPలు:
ఫోన్ కాల్స్ సమయంలో వింత శబ్దాలు వినిపించడం, మీరు పంపని SMSలు వెళ్లడం లేదా మీరు అడగకుండానే OTPలు, వెరిఫికేషన్ కోడ్‌లు రావడం వంటి లక్షణాలు కూడా ప్రమాద సూచికలు కావచ్చు. అలాగే మీ కాంటాక్టులకు మీకు తెలియకుండా మెసేజ్‌లు వెళ్లినా వెంటనే ఫోన్‌ను పరిశీలించాలి. ఇవి ఖాతాలను హ్యాక్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు సంకేతాలు కావచ్చు.

ఫోన్ పనితీరు మందగించడం:
ఇంతకుముందు వేగంగా పనిచేసిన ఫోన్ ఒక్కసారిగా చాలా నెమ్మదిగా మారడం, యాప్‌లు తరచూ క్రాష్ అవడం, ఫోన్ ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవడం లేదా స్క్రీన్ స్పందన తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని మాల్వేర్‌లు ఫోన్ వనరులను అధికంగా వినియోగించడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.

కొత్త యాప్‌లు కనిపించడం:
ఇన్‌స్టాల్ చేయని యాప్‌లు ఫోన్‌లో కనిపిస్తే అది తీవ్రమైన హెచ్చరికగా పరిగణించాలి. కొన్ని హ్యాకింగ్ టూల్స్ లేదా మాల్వేర్‌లు యూజర్‌కు తెలియకుండా యాప్‌ల రూపంలో ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతాయి. అలాంటి యాప్‌లకు కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్, కాంటాక్ట్స్ వంటి అనుమతులు ఉంటే వెంటనే వాటిని తొలగించి ఫోన్‌ను భద్రతా స్కాన్ చేయాలి.

పై లక్షణాలు కనిపిస్తే ముందుగా ఫోన్‌లోని అన్ని యాప్‌లను పరిశీలించి అనుమానాస్పద యాప్‌లను తొలగించాలి. ఆ తర్వాత బ్యాంకింగ్, ఇమెయిల్, సోషల్ మీడియా వంటి ముఖ్యమైన ఖాతాల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలి. అధికారిక యాంటీవైరస్ లేదా సెక్యూరిటీ యాప్‌తో పూర్తి స్కాన్ చేయాలి

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version