Petrol bunk: ప్రస్తుత కాలంలో పెట్రోల్ ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసరం. టూ వీలర్ నుంచి 4 వీలర్ ఉన్న వారు ఈ ఇంధనం లేకపోతే ఎటువంటి ప్రయాణాలు సాగవు. దీంతో లైఫ్ లో చాలా పనులు ఆగిపోతాయి. నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. అయినా వినియోగం ఆగడం లేదు. పెట్రోల్ కు ఉన్న డిమాండ్ చూసి దేశంలో చాలా వరకు పెట్రోల్ బంకులు ఏర్పడ్డాయి. అయితే అన్ని బంకుల్లో నాణ్యమైన పెట్రోల్ విక్రయిస్తున్నారా? అంటే లేదనేది కొన్ని పరిశోధనలను బట్టి తెలుస్తుంది. పెట్రోల్ బంకులోకి వెళ్లి బైక్ లో ఇంధనం పోసుకొని వెళ్తాం. కానీ అది నాణ్యమైన పెట్రోలా? లేదా? అనేది చూడం. అయితే ఇది కల్తీ పెట్రోల్ అయితే మాత్రం బైక్ పాడయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మైలేజ్ కూడా తక్కువగా వస్తుంది. మరి పెట్రోల్ కల్తీనా? కాదా? అనేది తెలుసుకోవడం ఎలా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
దేశంలో చాలా చోట్ల పెట్రోల్ బంకులు ఉన్నాయి. పట్టణాలతో పాటు ప్రధాన రహదారుల వెంట కూడా ఇవి దర్శనమిస్తాయి. అయితే పెట్రోల్ కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో కొందరు కల్తీ పెట్రోల్ విక్రయించే అవకాశం ఉంది. దీంతో ఈ విషయంలో వాహన వినియోగదారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొందరు పెట్రోల్ పై అవగాహన ఉన్న వారు కల్తీ పెట్రోల్ ను గుర్తించి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం వల్ల బంకులు మూతపడిన సంఘటనలు ఉన్నాయి. అందువల్ల తమకు అనుమానం వస్తే పెట్రోల్ ను బంకులోనే చెక్ చేసుకోవచ్చు.
ఒక బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నపపుడు బైక్ మైలేజ్ తక్కువగా ఇవ్వడం గానీ.. లేదా ఇంజిన్ లో సమస్యలు రావడం గాని వస్తే వెంటనే ఆ బంకులోకి వెల్లి పెట్రోల్ నాణ్యత గురించి పరీక్షించవచ్చు. మీరు నాణ్యతను పరీక్షించాలనుకున్ను పెట్రోల్ బంకుకు వెళ్లి ఒక ఫిల్టర్ పేపర్ ఇవ్వమనండి. ఇవి రెండు ముక్కలుగా చేయండి.. ఒక పేపర్ పై రెండు చుక్కల వరకు పెట్రోల్ చుక్కలు వేయాలి. ఇలా వేసిన వెంటనే అది ఎండిపోతుంది. కానీ అలా ఎండిపోకుండా మచ్చలాగా ఏర్పడినట్లు కనిపిస్తే అది కల్తీ పెట్రోల్ అని గుర్తించాలి. అలా కనిపించకుండా ఆవిరైపోతే అది నిజమైన కల్తీలేని పెట్రోల్ అని తెలుసుకోవాలి. దీనిని పెట్రోల్ బంక్ యజమానులకు తెలియజేయడానికి రెండు పేపర్లపై రెండు రకాల పెట్రోల్ చుక్కులు వేయడం వల్ల తెలిసిపోతుంది.
అయితే కొందరు బంక్ యజమానులు ఈ ప్రాసెస్ నిరాకరించవచ్చు. కానీ వినియోగదారుల ఫోరం ప్రకారం ఒక వినియోగదారులు తనకు అనుమానం ఉన్న పెట్రోల్ బంకుల్లో నాణ్యతను పరీక్షించవచ్చు. అయినా పెట్రోల్ బంక్ యజమానులు ఒప్పుకోకపోతే విజిలెన్స్ అధికారులకు పిర్యాదు చేయాలి. అప్పుడు వచ్చి వారు పెట్రోల్ నాణ్యతను పరీక్షిస్తారు. ఒకవేళ కల్తీ పెట్రోల్ ఉన్నట్లు గుర్తిస్తే ఆ బంక్ ను మూసివేసే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల మీ బైక్ ను మాత్రమే కాకుండా ఇతరుల వాహనాలను కూడా కాపాడిన వారవుతారు.