AP Rains: ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు.. ప్రజలకు హై అలర్ట్.. ఈసారి ఏమవుతుందో

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇటీవల తీరం దాటింది. బలహీనంగా మారింది. దాని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. వాటిని మరువక ముందే బంగాళాఖాతం మరో హెచ్చరిక పంపింది.

Written By: Dharma, Updated On : October 19, 2024 11:04 am

AP Heavy Rains

Follow us on

AP Rains: రాష్ట్రానికి మరో బిగ్ అలెర్ట్. బంగాళాఖాతం మరో హెచ్చరిక పంపింది. ఆదివారం బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 22 నాటికి వాయువ్య దిశగా కదులుతుందని.. 24 నాటికి వాయుగుండం గా బలపడుతుందని స్పష్టం చేసింది. ఇది ఏపీ, పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటి అవకాశం ఉందని తెలిపింది.దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయని కూడా స్పష్టం చేసింది. ఆదివారం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం విజయనగరం, విజయనగరం జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.

* పలు జిల్లాల్లో వర్షం
కాగా శుక్రవారం చాలా జిల్లాల్లో వర్షపాతం నమోదు అయ్యింది. ప్రధానంగా శ్రీకాకుళం, అన్నమయ్య, వైయస్సార్, గుంటూరు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్య సాయి, తిరుపతి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయింది. మరోవైపు తీర ప్రాంతంలో సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద అడ్డుగా ఉన్న గోడను అలలు కోసేసాయి. సముద్ర జలాలు తీరం వైపు వేగంగా దూసుకు వస్తుండడంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. వేటకు దూరంగా ఉన్నారు.

* ప్రభుత్వం అప్రమత్తం
మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం అప్రమత్తం అయ్యింది. భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు అన్ని రకాల సంసిద్ధంగా ఉంది. ఇప్పటికీ అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఎటువంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది. గత అనుభవాల దృష్ట్యా ముందుగానే మేల్కొంది.