Homeలైఫ్ స్టైల్Financial Planning: ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడమో.. చిట్టీలు వేయడమో కాదు.. ఈ పనిచేయండి

Financial Planning: ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడమో.. చిట్టీలు వేయడమో కాదు.. ఈ పనిచేయండి

Financial Planning: జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని చాలామందికి ఉంటుంది. కానీ అందుకు సరైన ఆర్థిక ప్రణాళిక వేసేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది మధ్యతరగతి ప్రజలు ధనవంతులను చూసి తాము అదే పొజిషన్లో ఉండాలని అనుకుంటారు. కానీ ధనవంతులు చేసే ప్రణాళికలు.. ఆలోచనలు మాత్రం చేయరు. వారి విధంగా ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా వారి సరసన చేరే అవకాశం ఉంటుంది. అసలు ఎలాంటి ప్రణాళిక వేస్తే ఆర్థిక అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది?

ఈరోజుల్లో ఆదాయానికి మించి అవసరాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకోవాలని చాలామంది చూస్తున్నారు. ఇందుకోసం రకరకాల పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు ప్రత్యేకంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. అయితే ఇవి అనుకున్నంత స్థాయిలో లాభాలు రావడం లేదు. దీంతో ఆదాయం సరిపోవడం లేదు. అటు ఉద్యోగం చేసేవారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటున్నాయి. దీంతో అప్పుల పాలు అవుతున్నారు.

ప్రతి ఒక్క వ్యక్తికి తనకు సరిపోయే ఆదాయం ఎన్నడూ రాదు. అయితే మనం చేసే ఖర్చులు, కొన్ని వస్తువుల్లో పరిమితి ఉంచుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకు వచ్చిన ఆదాయంతో రూ .10 లక్షలు పెట్టి కారు కొనుగోలు చేస్తాడు. అయితే అంతకంటే తక్కువ ఆదాయం వచ్చే వ్యక్తి కూడా కారు కొనాలని చూస్తుంటాడు. కారులో తిరగాలనుకోవడం తప్పేం కాదు. కానీ ఆ కోరికను పరిమితులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కారులో తిరగాలని అనుకున్నప్పుడు తనకు వచ్చే ఆదాయం ఎంత? అనేది చూసుకోవాలి. అయితే ఇతరుల ఆడంబరాలు చూసి కొందరు అప్పులు చేసి కారు కొనాలని అనుకుంటారు. అలా చేయడంవల్ల తిప్పలు పాలు కాక తప్పదు.

ఆదాయం పెరగాలంటే కేవలం జీతం పైనే ఆధారపడడం సరికాదు. వచ్చిన జీవితంలో సగభాగం ఖర్చులకు వినియోగించి.. మిగతా సగంలో కొంత భాగం పొదుపు కోసం కేటాయించాలి. మిగతా సగం ఎమర్జెన్సీ ఫండ్ కింద ఏర్పాటు చేసుకోవాలి. అయితే చాలామంది ఖర్చులు విపరీతంగా చేస్తూ.. పొదుపు తక్కువ చేస్తున్నారు. కొంతమంది 25% పొదుపు చేస్తున్నా.. అంతలోనే ఆగిపోతున్నారు. ఈ పొదుపు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోవాలి. అలా పోవడం వల్ల దీర్ఘకాలికంగా ఎంతో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

Also Read: మీకు వాహనాలు ఉన్నాయా? వెంటనే అలెర్ట్ కండి

ఖర్చుల విషయంలో చాలావరకు పరిమితులు ఏర్పాటు చేసుకోవాలి. దుబారా ఖర్చులను నియంత్రణ చేసిన సమయంలోనే ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని విలాస వస్తువులకు దూరంగా ఉండాలి. వీటివల్ల ఉపయోగం అయితే పర్వాలేదు.. కానీ నిరుపయోగంగా ఉంటే మాత్రం అవి ఎన్నటికైనా నష్టాన్ని చేకూరుస్తాయి.

కొంతమంది వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడమో.. చిట్టీలు వేయడమో చేస్తుంటారు. కానీ అనేక రకాలుగా ఈ పెట్టుబడులు వేస్తూ పోవాలి. కేవలం ఒకే దానిలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ఇలా అన్ని కలిపి ఒకేసారి దీనికి కాలికంగా అనేక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version