Corporate bonds India : సంపాదించిన డబ్బు ఒకే దగ్గర ఉంటే ఎలాంటి ఎదుగుదల ఉండదు. మనకు వచ్చిన ఆదాయాన్ని రకరకాల పెట్టుబడులు పెట్టడం వల్ల అది రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది తమ డబ్బును రెట్టింపు చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఏం చేయాలో అర్థం కాదు. ఎవరికైనా అప్పు ఇవ్వాలని అనుకుంటే తిరిగి ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. అలాకాకుండా బ్యాంకులో డిపాజిట్లు చేస్తే తక్కువ వడ్డీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో డబ్బులు ఉండి నిల్వ చేసే బదులు కార్పొరేట్ బాండ్స్ కొనుగోలు చేయడం వల్ల అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అయితే కార్పోరేట్ బాండ్స్ కొనుగోలు చేసే ముందు వాటిపై అవగాహన కలిగి ఉండాలి. అసలు ఈ బాండ్స్ ఎలా కొనుగోలు చేస్తారు? వీటిపై డబ్బు ఎవరు ఇస్తారు?
మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. కానీ కొన్నింటిలో మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలా లాభాలు వచ్చే వాటిలో కార్పొరేట్ బాండ్స్ ఒకటి. కార్పొరేట్ బాండ్స్ అనగా కొన్ని కంపెనీలు తమ కు అవసరమైన ఆదాయాన్ని ఆర్జిస్తాయి. అంటే ప్రజల వద్ద నుంచి డబ్బులు అప్పుగా తీసుకుంటూ ఉంటాయి. ఇలా తీసుకున్నందుకు వారికి నిర్ణయించిన వడ్డీ రేటును చెల్లిస్తారు. ఈ వడ్డీ రేటు ఒక్కోసారి 8 శాతం నుంచి 13 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించుకున్న తర్వాత ఆ సమయానికే పెట్టుబడితోపాటు వడ్డీని కలిపి చెల్లిస్తారు. అయితే కార్పొరేట్ బాండ్స్ కొనుగోలు చేయడానికి ఏం చేయాలి?
కార్పొరేట్ బాండ్స్ లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా Demat అకౌంట్ కలిగి ఉండాలి. ఆ తర్వాత Zerodha లో సెర్చ్ చేస్తే కార్పొరేట్ బాండ్స్ కనిపిస్తూ ఉంటాయి.కొన్ని కంపెనీలు NCDs పబ్లిక్ ఇష్యూ గా విడుదల చేస్తాయి.ఈ సమయంలో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.వీటి వడ్డీ రేట్లు 8 నుంచి12 శాతం ఉండవచ్చు. అయితే కంపెనీలను ఎంపిక చేసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ కంపెనీల రేటింగ్ను ముందుగానే నిర్ణయిస్తారు. ఒక కంపెనీకి AAA రేటింగ్ ఉంటే అది చాలా నెంబర్ వన్ కంపెనీ అని అనుకోవచ్చు. మరో కంపెనీకి BBB అని రేటింగ్ ఇస్తే అది మద్యస్థం అని అనుకోవాలి. కొన్ని కంపెనీలకు BB/B/C అని రేటింగ్ కూడా ఉంటుంది. అంటే ఇవి చాలా రిస్కుతో కూడుకున్నవని తెలుసుకోవాలి. ఇలా కంపెనీల రేటింగ్ను బట్టి అందులో పెట్టుబడులు పెట్టవచ్చు.
కార్పొరేట్ పాంట్స్ చూస్ చేసుకోగలరని మెయిల్ కు ఒక బాండ్ వస్తుంది. ఈ బాండ్ లో అగ్రిమెంట్ ఉంటుంది. మీరు ఎన్ని రోజులు లేదా ఎన్ని సంవత్సరాలు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అప్పటివరకు ఈ బాండ్ పనిచేస్తుంది. కాలం తీరిన తర్వాత నిర్ణయించిన వడ్డీ రేటు తో పాటు అసలును చెల్లిస్తారు. అయితే ఒక్కోసారి కంపెనీలు మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో నిపుణులను సంప్రదించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి.