Angry People Good Qualities: మనిషికి కోపం ఎన్నో రకాల అనర్ధాలకు దారి తీస్తుందని అంటారు. కోపం వల్ల సరైన నిర్ణయం తీసుకోలేకపోతారని చెబుతారు. అయితే కొంతమందికి చిన్న విషయానికి కోపం వస్తూ ఉంటుంది. మరికొంతమంది ప్రశాంతంగా ఉన్న తమకు నచ్చని పని ఎదురైతే వెంటనే కోపం వస్తుంది. నాకు పడే వారిని చూసి చాలామంది భయపడిపోతూ ఉంటారు. కొంతమంది వీరికి దూరంగా ఉండిపోతారు. అయితే కోపం గా ఉండే వారిలో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ నాలుగు లక్షణాలు కోపంగా ఉండే వారిలో ఉంటాయి. వీటి వల్ల ఎదుటివారికి ఉపయోగం కూడా ఉంటుంది. అవేంటో చూద్దాం..
ప్రేమ:
కోపంగా ఉండేవారు ఎప్పుడూ ఇతరులపై ప్రేమను చూపిస్తారు. ఎదుటివారిని ఎక్కువగా నమ్ముతారు. వారు చూపించే ప్రేమ స్వచ్ఛమైనది ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎవరినైతే ఇష్టపడతారో వారిని మాత్రమే నమ్ముతారు. ఈ ప్రేమను మరొకరిపై బదిలీ చేయకుండా ఉంటారు. అందువల్ల ఎక్కువగా కోప్పడే వారిని ఎక్కువగా నమ్మొచ్చు.
నిజం:
నిత్యం కోప్పడే వారు ఎప్పుడు నిజమే చెబుతూ ఉంటారు. అబద్ధం చెప్పడం వారికి నచ్చదు. అలాగే ఎదుటివారు అబద్ధం చెప్పిన వారు సహించలేరు. అందువల్ల వీరు నుంచి ఎలాంటి అబద్ధం గ్రహించడానికి వీలులేదు. ఒకవేళ మీ స్నేహితులు ఎవరికైనా కోపం ఉంటే వారు మీకు ఎప్పటికైనా నిజం చెపుతారని అనుకోవచ్చు. భార్యాభర్తలు కూడా కోపం వచ్చేవారు ఉంటే వారి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవని అనుకోవచ్చు.
Also Read: నూనె రాసేటప్పుడు ఈ తప్పులు అసలు చేయవద్దు. లేదా పెట్టి లాభం ఉండదు..
మోసం:
ఎదుటివారిపై ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించే వారు ఎవరిని మోసం చేయాలని అనుకోరు. మోసం చేయడం వీరికి చేతనే కాదు. నిజాయితీగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందువల్ల వీరితో ఎలాంటి ఇబ్బంది ఉండదని గ్రహించుకోవాలి.
సహాయం:
నిత్యం ఎదుటివారిపై అరుస్తూ ఉండేవారు ఇతరులకు ఎక్కువగా సహాయం చేస్తారు. వీరికి కోపం వచ్చినంత దాని కంటే ఎక్కువగా మంచి మనసు ఉంటుంది. నీ మనసు ఎప్పుడూ ఇతరులకు సాయం చేయాలని ఉంటుంది. ఏదైనా సహాయం అడిగితే కూడా వెనకాడకుండా చేస్తారు.
ఇవే కాకుండా కోపం వచ్చిన వారిలో చాలా మంచి లక్షణాలు ఉంటాయి. వీరు లోపల ఏది దాచుకోకుండా వెంటనే చెప్పేస్తారు. ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని పూర్తి చేసే వరకు వదలరు. నమ్మిన వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. కుటుంబ పెద్ద అయితే బాధ్యతలను విస్మరించకుండా ఉంటారు. ఎదుటివారిపై ఎంత కోప్పడుతున్నారో వారిపై అంతకంటే ఎక్కువగా ప్రేమను చూపిస్తారు. అయితే వీరికి కోపం వచ్చినప్పుడల్లా ఎదుటివారు శాంత పరచాలి. లేకుంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నిత్యం కోప్పడడం కూడా అంత మంచిది కాదు. దీంతో మెదడు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ పెరగడంతోనే కోపం వస్తుంది. ఇలాంటి అప్పుడు బీపీని తగ్గించే వ్యాయామం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉండే విధంగా చేయాలి. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలి. ఏ విషయంలో అయితే కోపం వస్తుందో అలాంటి విషయాలకు దూరంగా ఉండాలి. అప్పుడే అలాంటి వ్యక్తిని కాపాడుకోగలం.