Heart Diseases: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండె వ్యాధులు ఎక్కువగా వస్తాయి..ఏ గ్రూప్ వారికో తెలుసా?

2008 నాటికి ప్రపంచవ్యాప్తంగా మరణాలకు అత్యంత కారణం హృదయ సంబంధిత వ్యాధులేనని తేల్చారు. మూడు వంతుల కంటే ఎక్కువ భాగం కరోనరీ ఆర్టరీ వ్యాధితో పాటు హార్ట్ ఎటాక్ అని తేల్చారు.

Written By: Chai Muchhata, Updated On : September 29, 2023 10:44 am

Heart Diseases

Follow us on

Heart Diseases: మానవ శరీరంలో హృదయం అత్యంత కీలకమైన అవయం. గుండె కొట్టుకోవడం కొన్ని సెకన్ల పాటు ఆగిపోతే శరీరానికి శ్వాస ఆగిపోతుంది. ఫలితంగా ప్రాణం పోతుంది. అందువల్ల గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గుండె సంబంధిత వ్యాధులు, జాగ్రత్తలు తెలిపేందుకు ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 29న వరల్డ్ హార్ట్ డే ను జరుపుకుంటారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్టులు విలువైన సూచనలు అందిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా వారు తేల్చిన విషయమేంటంటే.. కొన్ని బ్లడ్ గ్రూప్ ల వారికి గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి రక్తం గడ్డకట్టే ఛాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వారికి ఈ సమస్య వస్తుంది అని అంటున్నారు. అయితే మరికొన్ని బ్లడ్ గ్రూప్ వారికి ఇలాంటి సమస్యలు తక్కువగా ఉంటాయట. ఆ వివరాల్లోకి వెళితే.

2008 నాటికి ప్రపంచవ్యాప్తంగా మరణాలకు అత్యంత కారణం హృదయ సంబంధిత వ్యాధులేనని తేల్చారు. మూడు వంతుల కంటే ఎక్కువ భాగం కరోనరీ ఆర్టరీ వ్యాధితో పాటు హార్ట్ ఎటాక్ అని తేల్చారు. గుండె ధమనుల ద్వారా సరఫరా చేయబడిన రక్తాన్ని శుద్ది చేసి ఎడమ బాగాలకు పంపుతుంది. ఇందులో రెండు గదులు ఉంటాయి. వీటిని కర్ణిక, జఠరిక అంటారు. శరీరంలోని కణాలు, కణజాలాలకు ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్లు, వ్యర్థ ఉత్పత్తులను రవాణా చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. గుండె రక్త నాళాల ద్వారా రక్తాన్ని తరలించడానికి ఒక పంపు వలె పనిచేస్తుంది. అయితే రక్తనాళాలు అన్ని శరీర భాగాలకు రక్తాన్ని పంపిణీ చేయడానికి వాహకాలుగా పనిచేస్తాయి.

గుండె కొట్టుకున్నప్పుడ తన గదుల నుంచి రక్తాన్ని ఇతర నాళాల్లోకి పంపిస్తుంది. ప్రతీ రోజూ గుండె 100, 000 సార్లు కొట్టుకుంటుంది. సుమారు 2,000 గ్యాలన్ల రక్తన్ని పంపింగ్ చేస్తుంది. కరోనరీ ధమనులు శరీరంలో పెద్దవి. ఇవి ఎడమ జఠరికకు అనుసంధానించబడి ఉంటాయి. ఆవి సంకోచించినప్పుడు ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఈ ఆక్సిజన్ ఆహారంలోని పోషకాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఎడమ, కుడి కరోనరీ ధమనులు గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి చన్న శాఖలు, ధమనులు కేళనాళికలుగా విభజించబడుతాయి.

గుండె సంబంధిత వ్యాధులు, జీవనశైలి లేదా జన్యుశాస్త్రంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కానీ ఒక్కోసారి బ్లడ్ గ్రూప్ కూడా గుండె సమస్యలకు కారణమవుతాయని కొందరు వైద్యులు చెబుతున్నారు. కొందరు వైద్యులు చేసిన పరిశోధనల్లో A,B బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేల్చరు. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి రక్తం ఎక్కువగా గడ్డ కడుతుంది. దీంతో గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయని చెబుతున్నారు.

బ్లడ్ గ్రూప్ ‘O’ ఉన్నవారికి గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా వస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు తేల్చారు. అంతేకాకుండా మిగతా బ్లడ్ గ్రూప్ ఉన్న వారి కంటే ఈ గ్రూప్ వారు గుండె సమస్యలు తక్కువగా ఎదుర్కొంటారన్నారు. ఇది 10 శాతం తక్కవుగా అని వైద్యులు తేల్చారు. అయితే ఈ బ్లడ్ గ్రూప్ డోనేట్ చేసేవారు తక్కువగా ఉంటారు.