PCOD: మహిళలను ఈ రోజుల్లో వేధించే సమస్యల్లో పీసీఓడీ ఒకటి. చాలా మంది మహిళలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు ఎక్కువగా బరువు పెరుగుతారు. హర్మోన్లలో మార్పులు వచ్చి పొట్ట, కొవ్వు చుట్టూ బాగా కొవ్వు పెరుగుతుంది. దీనివల్ల ఊబకాయం సమస్య బారిన పడతారు. పెళ్లయిన, కానీ మహిళలు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే పీసీఓడీ వల్ల బరువు పెరిగిన మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఉన్న మహిళలకు పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. దీనివల్ల అండం రిలీజ్ కాదు. దీంతో గర్భం దాల్చడం కష్టం అవుతుంది. ఈ సమస్య బారిన పడిన వారు కొందరు ఒత్తిడికి కూడా గురి అవుతారు. గర్భం దాల్చడానికి మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. పెళ్లయిన లేదా కానీ అమ్మాయిలు అయిన ఈ సమస్య వల్ల బరువు పెరిగితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకుని బరువు తగ్గాలి. ఎందుకంటే బరువు వల్ల సరిగ్గా పీరియడ్స్ కాకపోతే ఇంకా అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి పీసీఓడీ వల్ల బరువు పెరిగితే వెంటనే తగ్గడానికి ప్రయత్నించాలి.
పీసీఓడీ ఉన్నవారు ఎన్ని మందులు వాడిన బరువు తగ్గకపోతే కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా బరువు తగ్గడానికి రోజూ యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. వీటితో పాటు సూర్య నమస్కారాలు కూడా చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది. ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని ఉదయం పూట టిఫిన్‌గా తీసుకోవాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గుతారు. రోజూ తాజా పండ్లు, ఆకుకూరలు వంటివి తీసుకోవాలి. బాడీలో ఉన్న కొవ్వును తగ్గించడానికి దాల్చిన చెక్క, మెంతులు, కొత్తమీర టీ చేసుకుని తాగాలి. వీటిని కలిపి టీ చేసుకోవడం వల్ల బాడీలో ఉండే కొవ్వు తొందరగా కరిగిపోతుంది. ఈ మూడింటిని సమాన మోతాదులో తీసుకుని బాగా మరిగించాలి. ఇందులో తేనె కలుపుకుని రోజుకి ఒకసారి అయిన తాగితే తొందరగా బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి ముఖ్యంగా చేయాల్సిన పని.. తిన్న వెంటనే నిద్రపోకూడదు. రోజులో ఏ సమయంలో తిన్న తర్వాత అయిన కూడా ఒక పది నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే ఒంట్లో కొవ్వు పెరగకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు బయట ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోకూడదు. పోషకాలు ఉండే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. రోజూ ఉదయం మెంతి గింజలు నీటిని తాగాలి. ఈ వాటర్‌ను తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.