Navratri Gold Scheme Offers: మరికొన్ని రోజుల్లో దసరా పండుగ ఉన్న సంగతి తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా పేటీఎం గ్యాస్ సిలిండర్ యూజర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ‘నవరాత్రి గోల్డ్’ పేరుతో పేటీఎం యూజర్ల కొరకు స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకున్న వాళ్లకు 10,001 రూపాయి విలువైన బంగారం లభిస్తుంది.

పేటీఎం గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఎప్పటికప్పుడు స్పెషల్ ఆఫర్స్ ను ప్రకటిస్తూ వినియోగదారులకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. పేటీఎం యాప్ లో ఉండే ‘బుక్ గ్యాస్ సిలిండర్’ అనే ఫీచర్ సహాయంతో గ్యాస్ సిలిండర్ ను సులభంగా బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. భారత్, హెచ్పీ, ఇండియన్ గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందవచ్చు.
గ్యాస్ సిలిండర్ బుకింగ్ ద్వారా 1,000 క్యాష్ బ్యాక్ పాయింట్లను సైతం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ క్యాష్ బ్యాక్ పాయింట్లను ప్రముఖ బ్రాండ్ ల గిఫ్ట్ వోచర్స్, డీల్స్ ద్వారా రిడీమ్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ‘బుక్ గ్యాస్ సిలిండర్’ ట్యాబ్ లో గ్యాస్ సిలిండర్ ను ఎంచుకుని ఆ తర్వాత గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మొబైల్ నంబర్ లేదా ఎల్పీజీ ఐడీని ఎంటర్ చేసి గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవాలి. గ్యాస్ సిలిండర్ ను ఇప్పుడు బుకింగ్ చేసుకుని తర్వాత కుడా చెల్లింపులు జరిగే అవకాశం ఉండటం గమనార్హం.