Pawan Kalyan money tips: జీవితంలో ఏదో సాధించాలని అందరూ కలలు కట్టారు. ఉద్యోగంలోనూ.. వ్యాపారంలోనూ.. తమదే పైచేయి ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఈ ఆరాటానికి తగ్గట్టుగా కృషి కొందరు మాత్రమే చేస్తారు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు.. దాని అంచుల వరకు చేరాలంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆటుపోట్లను కొందరు మాత్రమే భరించుకుంటారు. కష్టమైనా.. నష్టమైనా.. చివరి వరకు చేరాలన్న సంకల్ప బలం ఉంటేనే గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఇలా చేరడానికి సినీ నటుడు పవన్ కళ్యాణ్ చెప్పిన గుణపాఠం ఏంటో చూద్దాం..
Also Read: జాగ్రత్త..! ఇన్ స్టాగ్రామ్ లో ఇక అలాంటి పోస్టులు పెడితే జైలుకే..
కొంతమంది అంటూ ఉంటారు.. తాము ఎంత ప్రయత్నించినా.. తనకు అదృష్టం లేదని.. ఎంత కష్టపడినా.. తన వెంటే దరిద్రం ఉందని చెబుతూ ఉంటారు. వాస్తవానికి అదృష్టం, దురదృష్టాలకు వివక్షలు ఉండవు. వాటికి మనుషుల లాగా స్వార్థాలు ఉండవు. ప్రతి ఒక్కరి దగ్గర ఇవి ఉంటాయి. అయితే అదృష్టాన్ని.. దురదృష్టాన్ని స్వీకరించడంలోనే తన విజయం దాగి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే రెండింటిని ఒకే స్థాయిలో చూస్తాడో.. అప్పుడు ఆ వ్యక్తి కచ్చితంగా విజయం సాధించగలడు. కేవలం అదృష్టాన్ని మాత్రమే కావాలని కోరుకునేవారు ఎప్పుడు కష్టాలనే చవిచూస్తూ ఉంటారు. అదృష్టమైనా.. దురదృష్టమైనా.. జీవితానికి పనికొచ్చేవే. కానీ దురదృష్టాన్ని వేరే రకంగా చూస్తారు.
ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తాడు. అలా ఒక పది ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి నిరాశ చెంది తనను దురదృష్టం వెంటాడుతుంది అని అనుకుంటాడు. కానీ అలా మరో 10 సార్లు ప్రయత్నిస్తే అతను సాధించే విజయం అనుకున్న దానికంటే గొప్పగా ఉంటుంది కావచ్చు. మనందరికీ KFC గురించి తెలిసిన విషయమే. ఈ సంస్థ వ్యవస్థాపకుడు కల్నల్ హర్లాండ్ సాండర్స్ తన విజయం కోసం జీవితాంతం ప్రయత్నించాడు. కానీ తన 60 సంవత్సరంలో ప్రపంచ గుర్తింపు పొందాడు. అయితే తాను మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తే తన నగరం పరిధిలో మాత్రమే గుర్తింపు ఉండేది. 60 సంవత్సరాల వయసులో కూడా అతని ప్రయత్నాన్ని చూసి ప్రపంచం ఇచ్చుకుంది. మరి ఈ 60 ఏళ్ల పాటు అతని వెంటాడిన దురదృష్టం మంచికా? చెడుకా?
ఇలాంటప్పుడు విజయం కోరుకునేవారు ప్రయత్నాలు మాత్రమే చేయాలి. అయితే ఆ ప్రయత్నాలను మారుస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాకాకుండా కేవలం పరిస్థితులు, అదృష్టాలు, దురదృష్టాల గురించి ఆలోచిస్తే మాత్రం ఉన్నచోట నుంచి కదిలే అవకాశం ఉండదు. అందుకోసం ముందుగా మైండ్ సెట్ ను మార్చుకునే ప్రయత్నం చేయాలి.
Also Read: వాట్సాప్‌లో ఇది తెరిచారో మీ డబ్బులు గోవిందా..
ప్రతి ఒక్కరికి జీవితంలో అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి. కొందరు మాత్రమే వాటిని సద్వినియోగం చేసుకుంటారు. అలా సద్వినియోగం చేసుకున్న వారు మాత్రమే జీవితంలో సక్సెస్ సాధిస్తారు. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది అనే సినిమాలో ఓ సన్నివేశం అలరిస్తుంది. ఒక సందర్భంలో నటుడు ఆలీ పవన్ వద్దకు వచ్చి డబ్బు కావాలని అడుగుతాడు. అప్పుడు ఒక సూట్ కేస్ ఇచ్చి తీసుకెళ్ళమని అంటాడు. కానీ ఆ సూట్ కేసును తీసుకొని వెళ్లకుండా తిరిగి వచ్చి నెంబర్ అడుగుతాడు. అప్పుడు ఆ సూట్ కేసును పవన్ తీసుకొని కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తాడు. ఈ సందర్భంలో పవన్ చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. అదృష్టం తలుపుదాకా వచ్చింది.. కానీ నీవు దానిని వినియోగించుకోలేదు అని అంటాడు.. ఈ విధంగానే ఒక వ్యక్తి కి తనకు వచ్చిన అవకాశాలను తాను చేయగలనో.. లేదో.. అనే అనుమానం ఉంటే మాత్రం ఎప్పటికీ విజయం అంచుల వరకు చేరలేరు. అందువల్ల గమ్యాన్ని చేరుకునేవారు ఆలోచన మార్చుకునే ప్రయత్నం చేయాలి.