Shocking Report: భారతదేశంలో అధిక రక్తపోటు చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు బీపీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు వస్తుందని అంచనా వేశారు. దీంతో బీపీతో చాలా అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రమాదకర స్థాయిలో ఉందని తెలుస్తోంది. బీపీ నియంత్రణలో లేకపోతే నష్టాలే ఎదురుకానున్నాయి.

అధిక రక్తపోటు ఎన్నో రోగాలకు కారణమవుతోంది. దీంతో మరణాలు కూడా పెరుగుతున్నాయి. బీపీతో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హైబీపీకి సంబంధించిన నివేదిక విడుదల చేసింది. దీంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధిక రక్తపోటుతో పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉందని తెలుస్తోంది.
Also Read: Asani Cyclone Impact: అసని తుఫాన్ ఎఫెక్ట్: ఏ దేశం నుంచో సముద్రంలో కొట్టుకు వచ్చిన బంగరు రథం.. వైరల్
పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో సర్వే నిర్వహించారు. అక్టోబర్ 2021 నాటికి 19 రాష్ట్రాల్లోని వందకు పైగా జిల్లాల్లో ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో 2017లో బీపీ తగ్గించేందుకు ఓ ప్రాజెక్టును చేపట్టారు. హైబీపీ ఆందోళనకరంగా మారుతోంది. ఆహారం మీద అదుపు లేకపోవడంతోనే ఇలా జరుగుతుందని చెబుతున్నారు.

బీపీని అదుపులో ఉంచుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉండవని తెలుస్తోంది. అందుకే అందరు బీపీ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు తినే ఆహారం మీద శ్రద్ధ తీసుకుంటున్నారు.దీంతో అధిక రక్తపోటు ఉన్నా హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. హైబీపీ బారిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి సోకుతున్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీపీ ఆందోళన కలిగించేదే అయినా దాన్ని అదుపులో ఉంచుకుంటే నష్టమేమీ ఉండదని తెలుస్తోంది.
Also Read:Chandrababu To Jail: చంద్రబాబును జైలుకు పంపడం జగన్ కు సాధ్యం అవుతుందా? సవాల్లేమిటీ?