
Breakfast: ఇటీవల కాలంలో చాలా మంది అల్పాహారం మానేస్తున్నారు. అధిక బరువు పెరుగుతున్నామనే ఉద్దేశంతో అల్పాహారం తినకుండా ఉంటున్నారు. దీంతో పలు సమస్యలకే కేంద్రంగా మారుతున్నారు. వ్యాధులు రావడానికి ఆస్కారమిస్తున్నారు. ఉదయం అల్పాహారం మానేయడం వల్ల పలు రకాల జబ్బులు రావడానికి కారణమవుతుంది. అల్పాహారం చేయకపోతే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ వద్దనుకోవడం మూర్ఖత్వమే. దీంతో లేనిపోని రోగాలకు మూలంగా నిలవడం ఖాయం.
ప్రస్తుత కాలంలో పని హడావిడిలో పడి తినడం కూడా పట్టించుకోవడం లేదు. ఉదయం చేసే అల్పాహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. ఫలితంగా అల్పాహారం చేసేందుకు సమయం తీసుకోవడం లేదు. అధిక బరువును అదుపులో ఉంచుకోవాలనే ఉద్దేశంతో టిఫిన్ తినడం మానేసినా ఇంకా అదనపు ఇబ్బందులు తలెత్తుతాయని తెలుసుకోవడం లేదు. అల్పాహారం తీసుకోకపోతే అనర్థాలే వస్తాయి. దీంతో ఉదయం సమయంలో చేసే టిఫిన్ ను కచ్చితంగా తినాల్సిందే. తినకపోతే తిప్పలు తప్పవు.
అల్పాహారం చేయకపోతే డయాబెటిస్ ముప్పు పొంచి ఉంటుంది. మనం తిన్న తినకపోయినా మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది రక్తంల చక్కెర శాతం పెరగకుండా నిరోధించేందుకు అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారం మానేస్తే అధిక బరువు పెరుగుతారు. బరువు తగ్గించుకునేందుకు ఉపవాసం చేస్తున్నామని అనుకుంటున్నా ఇంకా సమస్య పెంచుకునేందుకు కారకులమవుతాం. ఈ విషయం తెలియక అందరు టిఫిన్ మానేసి ఉపవాసం చేస్తుంటారు. ఇది కరెక్టు కాదు.

అల్పాహారం మానేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. మనం ఏదో ఒకటి తింటుంటూనే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మనం తినడం మానేస్తే జీర్ణక్రియ కూడా ముందుకు సాగదు. ఈ నేపథ్యంలో మనం తిన్న ఆహారాలు త్వరగా అరగాలంటే ఉపవాసం చేయకూడదు. చిరాకు, ఒత్తిడి హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. జుట్టు రాలడం జరుగుతుంది. ఇలా అల్పాహారం చేయకపోవడం వల్ల మనకు ఏర్పడే ఇబ్బందులు వస్తాయనడంలో సందేహం లేదు.
క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుంది. తలనొప్పి బాధిస్తుంది. ఇలా ఎన్నో బాధలకు కారణమయ్యే అల్పాహారం తినడంపై దృష్టి పెట్టాలి. ఉదయం సమయంలో అల్పాహారం చేయకపోతే కడుపులో అనేక సమస్యలకు దారి తీస్తుంది. నెలసరిలో మార్పులు వస్తాయి. టిఫిన్ చేయడం మాత్రం మరిచిపోకుండా చేయడం వల్లే మనకు మంచి ఫలితాలు రావడం సహజం. ఈ నేపథ్యంలో అల్పాహారం మానేయడం వల్ల సమస్యల్ని కొని తెచ్చుకోవడం మంచిది కాదు.
