D2M: సాంకేతికత పెరుగుతోంది. సమాచార రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. సాంకేతిక విప్లవం మార్పులకు శ్రీకారం చుడుతోంది. రోజురోజుకు ఎన్నో రకాల సదుపాయాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. శాస్త్రరంగంలో వస్తున్న మార్పులతో ఎన్నో వైవిధ్యమైన రీతిలో ముందుకు వెళ్తున్నారు. పూర్వం రోజుల్లో ఇంట్లో రేడియో ఉంటేనే ఎంతో విలువ ఉండేది. ఇప్పుడు టీవీలున్నా మామూలుగానే చూస్తున్నారు. ఇంకా పెనుమార్పులు రానున్నాయి.

ఇక మీదట టీవీ ప్రసారాలను కూడా ఫోన్లలో చూసుకునే వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీని ఎంచుకుంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఇంతకుముందు టీవీ ప్రసారాలను నేరుగా చూసే అవకాశం ఉండేది కాదు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు మొబైళ్లలో కూడా టీవీ ప్రసారాలు లైవ్ లో చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎఫ్ఎం రేడియో మాదిరి టీవీ ప్రసారాలను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మల్టీమీడియా కంటెంట్ నేరుగా వస్తుందని చెబుతున్నారు. టీవీ కార్యక్రమాలను నేరుగా సెల్ ఫోన్ కే ప్రసారం చేసే విధానం అమలులోకిరానుంది. దీంతో ఇక మీదట అరచేతిలోనే టీవీ ప్రసారారాలు కనిపించనున్నాయి. అధునాతన సాంకేతిక విధానాలతో సమాచారం రంగంలో విప్లవాత్మకమైన పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే టీవీ ప్రసారాలు నేరుగా సెల్ ఫోన్ లో రావడానికి మార్గాలు సుగమం అవుతున్నాయి.

ఇకపై అన్ని కార్యక్రమాలు సెల్ లోనే చూడొచ్చు. మనం ఎక్కడ ఉన్నా డైరెక్టుగా టీవీ ప్రోగ్రాములు మొబైళ్లలో వస్తాయంటే అందరికి ఆసక్తి కలుగుతోంది. టీవీ చూసేందుకు ఇకపై ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా టీవీ చూసుకునే అవకాశం ఏర్పడనుంది. ఇది నిజంగా అందరికి శుభవార్తే. టీవీ ప్రసారాలు నేరుగా సెల్ ఫోన్లలో ప్రసారం కావడానికి తగిన చర్యలు తీసుకోవడంతో త్వరలో ఆ ముచ్చట తీరనుంది. ఇది నిజంగా సమాచార విప్లవమే అవుతుంది. అధునాతన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం తలమునకలైంది.