T20 World Cup 2022: ప్రపంచంలో టీ20 మ్యాచులకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో చాలా దేశాలు టీ 20 ఆటలు ఆడేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఫలితంగా పోటీ వాతావరణం పెరిగిపోతోంది. పొట్టి క్రికెట్ కు అన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి. త్వరలో ఆస్ర్టేలియాలో జరగనున్న ప్రపంచ కప్ కోసం కొత్త జట్లు ముందుకు రానున్నాయి. ప్రధాన జట్లకు కూడా పోటీ పెరగనుంది. ఇప్పటికే మన దేశం ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. తరువాత కూడా పలు దేశాల్లో టూర్లకు వెళ్లనుంది. వచ్చే ప్రపంచ కప్ కు సన్నద్ధం అవుతోంది.

పోటీ పెరిగినందున అన్ని దేశాలు కూడా కప్ గెలవాలనే భావిస్తున్నాయి. ఇందులో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీ 20 మ్యాచుల ప్రాధాన్యం పెరిగిపోతోంది. అన్ని జట్లు పొట్టి క్రికెట్ నే నమ్ముకుంటున్నాయి. వన్డే క్రికెట్ కు కూడా పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఆయ దేశా జట్లు బిజీ షెడ్యూల్ తో ముందుకు సాగుతున్నాయి. ప్రతి దేశం ఏదో ఒక దేశంతో ఆటలోనే కొనసాగుతోంది. రాబోయే కాలంలో టీ 20 ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాయి.
Also Read: Dalits in AP: ఏపీలో దగాపడ్డ దళితులు.. నోరు మెదపని దళిత మేధావులు
అక్టోబర్ 16 టీ 20 ప్రపంచ కప్ సంరంభం షురూ కానుంది. దీనికి వేదిక ఆస్ట్రేలియా అవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మమ్మరం అయ్యాయి. టీ 20 ప్రపంచ కప్ లో గెలిచి తమ సత్తా చాటాలని అన్ని దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ ఆట తీరు మెరుగుపరుచుకునే పనిలో పడిపోయాయి. ఆటలో మెలకువలు నేర్చుకుని ప్రత్యర్థి జట్లను మట్టి కరిపించాలని రెడీ అవుతున్నాయి. నేటి నుంచి సరిగా వంద రోజులకు ప్రపంచ సంగ్రామం ప్రారంభం కానుందని తెలుస్తోంది. టాప్ జట్లకు ఇదో చాలెంజ్ గా మారనుంది. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్నాయి.

టీ 20 ప్రపంచ కప్ లోకి రెండు దేశాలు ప్రవేశించనున్నాయి. జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లు రానున్నట్లు తెలుస్తోంది. దీంతో టీ 20 సంగ్రామంలో కీలక పోరు జరగనుంది. ఈ రెండు జట్లు తమ ప్రతిభ ఆధారంగా వచ్చే వరల్డ్ కప్ లో పాల్గొని పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీ 20 జట్లు తమ ఆటతీరు మెరుగుపరుచుకుని విజయయాత్ర కొనసాగించాలని చూస్తున్నాయి. మొత్తానికి వరల్డ్ కప్ లో రాణించి కప్ కైవసం చేసుకోవాలని అన్ని జట్లు ప్రయత్నిస్తున్నాయి. టీ 20 పోటీలు రసవత్తరంగా సాగునున్నాయి.
Also Read:Killi Krupa Rani: ఆ కేంద్ర మాజీ మంత్రి చూపు టీడీపీ వైపు.. అసలేం జరిగిందంటే..