NBCC Recruitment 2022: నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 81 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఇంజనీర్ (సివిల్) 60, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 20, డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్) 1 ఉద్యోగ ఖాళీ ఉంది.

28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు జూనియర్ ఇంజనీర్ (సివిల్) ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కచ్చితంగా ఇంజనీరింగ్ డిప్లొమాను కలిగి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలకు ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన వాళ్లు అర్హత కలిగి ఉంటారు. 28 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
Also Read: Celebrities Heap Praise On RRR: ఆర్ఆర్ఆర్‌పై సినీ హీరోల ప్రశంసలు.. ఎవరెవరు ఏం చెప్పారంటే..
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్) జాబ్స్ కు బీఈ/బీటెక్ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 46 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఆన్‌లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకురూతుంది.
పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు రాతపరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.
Also Read: RRR Craze: ఓవర్సీస్, దేశవ్యాప్తంగా దుమ్మురేపుతున్న ఆర్ఆర్ఆర్