
MS Dhoni: ధోని.. టీమిండియా కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత ఈ ఆటగాడి సొంతం. మైదానంలో చిరుతపులిలా పరిగెత్తే ఈ జార్ఖండ్ డైనమైట్ కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయాలు ఉన్నాయి. మరెన్నో మధుర స్మృతులు కూడా ఉన్నాయి. అలాంటి ఈ ఆటగాడు ఐపీఎల్ లోనూ విజయవంతమైన కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు.. అయితే చాలామందికి వయసు పెరుగుతున్న కొద్దీ ఆటపై పట్టు తగ్గుతుంది. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు.. కానీ ఇది ధోని విషయంలో తిరగరాసుకోవాలేమో.
ఎందుకంటే శుక్రవారం అహ్మదాబాద్ లో గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోని ఇచ్చిన దమ్కి మామూలుది కాదు. చెన్నై ఇన్నింగ్స్ లో 17.4 ఓవర్ వద్ద జోసెఫ్ బౌలింగ్లో బౌండరీ కోసం ప్రయత్నించి రవీంద్ర జడేజా శంకర్ కు చిక్కాడు. దీంతో మైదానంలోని అభిమానులు గట్టిగా కేకలు వేశారు. అయితే వారంతా కేకలు వేసిన కారణం వేరు. ఆ సమయంలో ధోని బ్యాటింగ్ చేసేందుకు క్రీజు వైపు కదిలాడు. అయితే ధోని బ్యాటింగ్ మిస్ అవుతాము అనుకున్న వారికి చివర్లో ఈ జార్ఖండ్ డైనమైట్ నిరాశ కలిగించలేదు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మహేంద్రసింగ్ ధోని రెచ్చిపోయాడు.. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ తనలో పస తగ్గలేదని నిరూపించుకున్నాడు..జోష్ లిటిల్ వేసిన చివరి ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ బాది గుజరాత్ జట్టుకు చుక్కలు చూపించాడు.. తాను ఎదుర్కొన్న ఐదు బంతుల్లో 13 పరుగులు చేసి చెన్నై జట్టు స్కోర్ ను 178 పరుగులకు చేర్చాడు.
వాస్తవానికి అహ్మదాబాద్ గుజరాత్ జట్టు సొంతమైదానం. అయినప్పటికీ స్టేడియం ధోని నామస్మరణతో హోరెత్తిపోయింది. పసుపు రంగు జెర్సీలతో అభిమానుల సంబరం “యెల్లో”లు దాటింది. అంటే ఇదంతా కూడా కేవలం ఒక వ్యక్తి కోసం.. అతడు ధోని అని చెప్పాల్సిన పనిలేదు.. నిరూపించుకోవాల్సిన అక్కర అభిమానులకు లేదు.. చివరికి చాలామంది గుజరాతీలు కూడా తమ టీంకు సపోర్ట్ చేయడం మానేసి ఎల్లో కలర్ జెర్సీలు వేసుకోచ్చారు. ధోని ధోని అంటూ నినాదాలు చేశారు. ఫ్లకార్డులు పట్టుకుని తమ అభిమానాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో పాటలు పాడి అభిమానులను అలరించిన అర్జిత్ సింగ్ ధోని పాదాలను తాకాడు. ధోని వారించినప్పటికీ.. అతడు వినిపించుకోలేదు. దీంతో స్టేడియం ఒకసారిగా ధోని నామస్మరణతో ఊగిపోయింది. చివరికి గుజరాత్ జట్టులోని సభ్యులు కూడా చప్పట్లు కొట్టి ధోనిపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
A tribute to MS Dhoni by Star Sports, 15 years of legacy in IPL.#7forever #IPLonStar pic.twitter.com/3AWaK1SLLt
— Johns. (@CricCrazyJohns) March 25, 2023