https://oktelugu.com/

Relationship : భార్య ఫోటో ఆల్బమ్ తిరిగేస్తుండగా.. షాకింగ్ సీన్.. ఏం జరిగిందంటే?

పాత ఫొటో అల్బమ్ ను చూశాడు. దీనిని ఆసక్తిగా తిరిగేస్తుండగా.. అతనికి ఓ షాకింగ్ సీన్ కనిపించింది. దీనిని చూసిన అతనికి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇలాంటి అరుదైన చిత్రాలు కొందరికి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నా వంతు వచ్చింది.. అని అతడు అంటున్నాడు. ఇంతకీ భార్య అల్బమ్ ఫొటోలో అతడు చూసిందేమిటి? ఎందుకు షాక్ తిన్నాడు? ఆ వివరాల్లోకి వెళితే.

Written By:
  • Srinivas
  • , Updated On : September 14, 2024 / 11:36 PM IST

    China

    Follow us on

    Relationship :  భార్యభర్తల మధ్య ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పెళ్లి కాకముందే ఎన్నో అనుభవాలు ఉంటాయి. కానీ పెళ్లయిన తరువాత దంపతుల మధ్య జరిగే విషయాలను ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఓ సందర్భంలో తన అత్తగారింటికి వెళ్లాడు. ఈ సమయంలో తన భార్యకు సంబంధించిన పాత ఫొటో అల్బమ్ ను చూశాడు. దీనిని ఆసక్తిగా తిరిగేస్తుండగా.. అతనికి ఓ షాకింగ్ సీన్ కనిపించింది. దీనిని చూసిన అతనికి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇలాంటి అరుదైన చిత్రాలు కొందరికి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నా వంతు వచ్చింది.. అని అతడు అంటున్నాడు. ఇంతకీ భార్య అల్బమ్ ఫొటోలో అతడు చూసిందేమిటి? ఎందుకు షాక్ తిన్నాడు? ఆ వివరాల్లోకి వెళితే..

    కొత్తగా పెళ్లయిన సందర్భంగా దంపతుల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా వారి చిన్న నాటి గుర్తులను నెమరేసుకుంటారు. ఒక్కోసారి పెళ్లి కాకముందు జరిగిన విషయాలను ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటారు. తాము చిన్నప్పుడు ఎలా ఉండేవారమే భార్య భర్తకు.. భర్త భార్యకు చెబుతూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు. కానీ కొందరు మాత్రం అర్థం చేసుకొని సర్దుకుపోతుంటారు. అలా ఓ భర్త తన భార్యకు సంబంధించిన పాత ఫొటో అల్బమ్ ను తిరిగేస్తుండగా..

    చైనాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని చెంగ్డూ నగరానికి చెందిన మిస్టర్ యే, జూ లు ఒకరికొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు సరదాగా ఉన్న వీరు ఆ తరువాత తన భార్య తల్లిగారింటికి మిస్టర్ యే వచ్చాడు. సాధారణంగా ఎవరైనా తన చిన్న నాటి విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. ఈ సందర్భంగా తన భార్యకు సంబంధించి ఫొటో అల్బమ్ ను తిరగేశాడు. అందులో ఓ ఫొటోను చూసి అతడు షాక్ కు గురయ్యాడు.

    ఓ పురాతన కట్టడం ముందు తన భార్య కూర్చొని ఫొటో దిగింది. కానీ ఆ వెనకాలే అతడు కూడా ఉన్నాడు. ఆ సమయంలో వీరిద్దరికి అస్సలు పరిచయం లేదు. కానీ వీరిద్దరు కలిసి ఒకే ప్రేమ్ లో యాదృచ్చికంగా వచ్చారు. గమ్మత్తేంటంటే ఇద్దరు కలిసి ఫొటో దిగినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి మిస్టర్ యే తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడకి వచ్చాడు. తాను కూడా ఫొటో తీయించుకున్నాడు. కానీ ఒకే ప్రేమ్ లో వీళ్లిద్దరు కలిసి రావడం ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరుదుగా జరిగే ఈ సంఘటనపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కొందరు పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడుతాయని అంటారు కదా.. వీరి పెళ్లిని ఇలా ముందే ఫొటో ప్రేమ్ లో డిసైడ్ చేశారని అంటున్నారు. ఇలాంటి విషయాలు చాలా తక్కువగా చోటు చేసుకుంటాయి. దీంతో చాలా మంది దీనిని ఆసక్తి చూస్తూ షేర్ చేస్తున్నారు.