https://oktelugu.com/

Dating : డేటింగ్ కి వెళ్లే ముందు.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

డేటింగ్ లోకి వెళ్లేముందు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే ప్రమాదంలో పడతారు. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలియని వాళ్లతో అంటే ఆన్ లైన్ లో పరిచయం అయిన వాళ్లతో చేస్తున్నారు. కాబట్టి డేటింగ్ చేసే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 14, 2024 / 10:51 PM IST

    Dating 

    Follow us on

    Dating :  ఈరోజుల్లో డేటింగ్ అనేది ఒక ట్రెండ్ లా మారిపోయింది. ఒకప్పుడు రోజుల్లో ప్రేమ అంటే ఏంటో కూడా పెద్దగా తెలియదు. కానీ ఈరోజుల్లో స్కూల్ పిల్లలు నుంచే ప్రేమ వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి. తెలిసి తెలియని వయస్సులో చాలా మంది డేటింగ్ చేస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా వాడకం బాగా పెరగడంతో అందరూ ఎక్కువగా డేటింగ్ చేస్తున్నారు. కొన్ని రోజులు డేటింగ్ చేసి నచ్చితే పెళ్లి చేసుకుంటారు. లేకపోతే లేదన్నట్టుగా ప్రస్తుతం యువత ఉంది. అయితే డేటింగ్ చేయడం వల్ల కొందరికి వాళ్లతోనే పెళ్లి అవ్వచ్చు. కానీ అందరికీ ఇలా జరగదు. చాలా మంది కొన్ని రోజులు మాత్రమే ఉంటున్నారు. మళ్లీ ఇంకో కొత్తవాళ్లని చూసుకుంటున్నారు. అయితే డేటింగ్ లోకి వెళ్లేముందు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే ప్రమాదంలో పడతారు. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలియని వాళ్లతో అంటే ఆన్ లైన్ లో పరిచయం అయిన వాళ్లతో చేస్తున్నారు. కాబట్టి డేటింగ్ చేసే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.

    కొందరు పెళ్లి చేసుకోవాలని డేటింగ్ కి వెళ్తుంటారు. ఇలా డేటింగ్ చేశాక పార్టనర్ నచ్చితే.. పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో ఉంటారు. ఈ క్రమంలో కొందరు వాళ్ల పర్సనల్ విషయాలు అన్ని వాళ్లతో షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా ఏటీఎం పిన్ వంటివి చెప్పేస్తారు. అలాగే ఇంట్లో డబ్బు, నగలు ఎక్కడ ఉన్నాయి అని కూడా చెబుతుంటారు. దీంతో వీళ్లు ఏదో ఒకరోజు వాటిని తీసుకుని మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఎందుకు అంటే ఈ మధ్య ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి అందరిని గుడ్డిగా నమ్మేయవద్దు. డేటింగ్ లో చాలా మంది వాళ్ల మాటలతో నమ్మిస్తారు. అలాంటి మాటలను అసలు నమ్మవద్దు. ఇలా మాటలు నమ్మి వాళ్లు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తుంటారు. తీరా వాళ్లతో వెళ్తే.. ఒరిజినల్ క్యారెక్టర్ తెలుస్తుంది. కాబట్టి డేటింగ్ లో ఉండే అమ్మాయిలు అయిన అబ్బాయిలు అయిన ఎదుటి వాళ్లు ఎలాంటి వాళ్లో కాస్త తెలుసుకుని అప్పుడు డేటింగ్ చేయాలి. చాలా మంది డేటింగ్ లో చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే.. వాళ్లు చూపించే అబద్దం ప్రేమ, గిఫ్ట్ లకు వాళ్లను నమ్మేస్తారు. ఎంత ఇష్టం లేకపోతే గిఫ్ట్ లు ఇస్తారనే భ్రమలో ఉంటారు. ఇవన్నీ కేవలం నమ్మించడానికి మాత్రమే చేస్తుంటారు. ఇప్పుడైతే ఎక్కువగా ఆన్లైన్ డేటింగ్ జరుగుతున్నాయి. ఇవి చాలా ప్రమాదకరం. డిప్రెషన్ లేదా బాధలో ఉండి కొంతమంది ఈ ఆన్లైన్ డేటింగ్ వైపు మక్కువ చూపిస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు అలోచించి డేటింగ్ చేయాలి. లేకపోతే మీరు ప్రమాదంలో పడినట్లే.