VU TV : న్యూ లాంచ్: ఈ వీయూ టీవీలో భారీ ఫ్యూచర్లు.. ధర ఎంతో తెలుసా?

అమెరికన్ టీవీ తయారీదారు కంపెనీ వీయూ వీక్షకుల ఆశల మేరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన టీవీని తీసుకువచ్చింది. ఇందులో ఇన్ బుల్ట్ గా సౌండ్ బార్ ఇన్ స్టాల్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. అత్యంత భారీ పిక్సల్స్ తో మంచి దృశ్యంతో పాటు మంచి సౌండ్ ను కూడా అందిస్తుంది. అందుకే ఈ టీవీ గురించి అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.

Written By: NARESH, Updated On : August 2, 2024 4:54 pm
Follow us on

VU TV :  అమెరికన్ కంపెనీ స్మార్ట్ టీవీ వీయూ (VU) వచ్చినప్పటి నుంచి సోనీ, ఫిలిప్స్, ఎంఐ తదితర పెద్ద పెద్ద కంపెనీలు ఇరకాటంలో పడ్డాయి. స్మార్ట్ టీవీల పరంగా అత్యంత భారీ ఫ్యూచర్లతో ఈ టీవీలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఎక్కువ రెజుల్యూషన్, తక్కువ సెకండ్ల రెస్పాండ్ ఈ టీవీల ప్రత్యేకం. వీయూ తన కొత్త టీవీ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ తో వచ్చిన ప్రపంచంలోనే తొలి టీవీగా ‘వీయూ వైబ్ క్యూఎల్ఈడీ’ టీవీని లాంచ్ చేసింది. ఈ టీవీని వీయూ డిజైన్ సెంటర్ లో అభివృద్ధి చేశారు. ఇది ఇన్-బిల్ట్ సౌండ్ బార్ తో వచ్చింది. ఇది నేరుగా టీవీ సర్క్యూట్ కు కనెక్ట్ అవుతుంది. ఇది మంచి సౌండ్ క్వాలిటీ అవుట్ పుట్ ఇస్తుంది. వివిధ స్క్రీన్ సైజుల్లో వీయూ వైబ్ క్యూఎల్ఈడీ టీవీని కంపెనీ లాంచ్ చేసింది. 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

స్పెసిఫికేషన్స్?
ఈ టీవీ మూడు వైపులా బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. ఇది కఠిన చిక్కగా ఉన్న నలుపు రంగులో ఉంటుంది. టీవీ వాల్, టేబుల్ మౌంట్స్ రెండింటితో వస్తుంది. దీన్ని ఎక్కడైనా గోడ లేదా టేబుల్ పై ఉంచడం ద్వారా ఉపయోగించవచ్చు. 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇందులో 4కే క్యూఎల్ఈడీ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ డిస్‌ప్లే 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ తో వస్తుంది. ఇందులో హెచ్‌డీఆర్ 10, హెచ్ఎల్జీ, గేమ్ మోడ్, ఏఐ పిక్చర్ బూస్టర్, డైనమిక్ కాంట్రాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీ క్వాడ్ కోర్ ఏఐ ప్రాసెసర్ తో వస్తుంది.

ఇందులో వాయిస్ సెర్చ్ ను కూడా అమర్చారు. వీయూ యాక్టివోయిస్ రిమోట్ తో వస్తుంది. ఇందులో మీకు స్పోర్ట్స్, సినిమా మోడ్స్ ఉంటాయి. ఈ టీవీలో 16 జీబీ స్టోరేజ్, 2 జీబీ ర్యామ్ ఉన్నాయి. ఈ టీవీలో 88 వాట్ సౌండ్ బార్ ఉంది. ఇది ఇన్ బిల్ట్ గా ఉంటుంది. గూగుల్ టీవీ ఓఎస్ పై ఈ టీవీ పనిచేస్తుంది.

ధర ఎంతంటే?
43 అంగుళాల వీయూ వైబ్ క్యూఎల్ఈడీ టీవీ ధర రూ. 30,999 నుంచి ప్రారంభం అవుతోంది. దీని 50 అంగుళాల వేరియంట్ ధర రూ. 35,999. 55 అంగుళాల వేరియంట్ ధర రూ. 41,999 కాగా, 65 అంగుళాల వేరియంట్ ధర రూ. 58,999. మీరు Amazon.in, ఇతర ప్రధాన రిటైల్ స్టోర్ల నుంచి ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.

గత టీవీల కంటే దీన్ని ప్రత్యేకంగా తెచ్చినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ టీవీకి ముందు నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, డిమాండ్ మేరకు తయారు చేస్తున్నట్లు యాజమాన్యం చెప్తోంది. సౌండ్ సిస్టంతో పాటు అనేక విషయాలను ఇందులో పొందుపరిచామని కంపెనీ చెప్తోంది.