Life Lesson about Money: ఉదయం నుంచి సాయంత్రం వరకు మనిషి జీవితాన్ని నడిపించేది డబ్బు. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో జీవించడం కష్టం అనేది ఈ రోజుల్లో చాలామంది చెబుతున్న మాట. డబ్బు ఉంటేనే సమాజంలో విలువ ఉంటుంది. డబ్బుతోనే ఏ పని అయినా పూర్తి చేయగలుగుతాం. అయితే చాలామంది డబ్బు కంటే మానవ విలువలు ముఖ్యం అని అంటూ ఉంటారు. అలాగే డబ్బు ఎక్కువగా ఎందుకు? అని చెబుతూ ఉంటారు. కానీ సంతోషంగా జీవించడానికి.. సమాజంలో గౌరవం ఉండడానికి.. కావలసిన సౌకర్యాలు పొందడానికి డబ్బు కచ్చితంగా కావాలని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి కూడా డబ్బు ఉండాలని అంటున్నారు. అసలు డబ్బు ఎంత ఉండాలి? డబ్బు ఏ విధంగా ఉపయోగపడితే మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది?
ఉదాహరణకు ఒక వ్యక్తి మన పక్కనే ఉండి కొన్ని రోజుల తర్వాత బాగా డబ్బు సంపాదించాడని అనుకుందాం. అయితే ఆ వ్యక్తిని చూస్తే మరో వ్యక్తికి కచ్చితంగా ఈర్ష కలుగుతుంది. తాను కూడా ఆ స్టేజికి వెళ్లాలని అనుకుంటాడు. అయితే కేవలం అనుకుంటే సరిపోదు. ఆ స్థాయికి వెళ్లాలంటే కచ్చితంగా డబ్బు సంపాదించే ఉండాలి. ఎందుకంటే ఉన్నత స్థితిలో ఉండడానికి డబ్బు అనేది చాలా అవసరం. అలాగే ఉన్నత స్థితిలో ఉన్నవారికి గౌరవం ఎక్కువగా ఉంటుందనేది నిత్యసత్యం. ఇలాంటి గౌరవం పొందాలంటే డబ్బు కచ్చితంగా సంపాదించే ఉండాలి.
కొంతమంది పగటి కలలు కంటూ ఉంటారు. రాత్రికి రాత్రే స్టార్లు కావాలని అనుకుంటారు. ఇవి ఎవరో కొందరి జీవితంలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. అయితే అనుకున్నది సాధించకపోయిన సరిపోయేంత సౌకర్యాలు కావాలంటే మాత్రం కచ్చితంగా డబ్బు ఉండాలి. ఆ డబ్బు సంపాదన కోసం నిత్యం కష్టపడుతూ ఉండాలి. ఏ కష్టం లేకుండా డబ్బు అనేది రాదు. కానీ కష్టపడితే వచ్చిన డబ్బు ఎప్పటికీ తిరిగి వెళ్ళదు. అందువల్ల సాధ్యమైనంత వరకు నిజాయితీతో డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి
కారులో తిరగాలని ఉంటుంది.. కొత్త ఇల్లు కొనుక్కోవాలని ఉంటుంది.. విదేశాలకు వెళ్లాలని ఉంటుంది. ఇలా చాలామందికి అనేక రకాల కోరికలు ఉంటాయి. ఈ కోరికలను తీర్చుకోవడానికి కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోదు. దానికోసం డబ్బు సంపాదించి ఉండాలి. డబ్బు సంపాదిస్తేనే ఈ కోరికలన్నీ తీరే అవకాశం ఉంటుంది. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఫలితంగా ఎలాంటి రోగాలు రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఎదుటివారిని చూసి ఎప్పుడూ ఆలోచించకుండా.. మనం ఎలా డబ్బు సంపాదించాలి? అన్న విషయంపై ఎక్కువగా దృష్టి పెడితే తొందర్లోనే వారి కంటే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా డబ్బు సంపాదించడం మాత్రమే కాదు దానిని పొదుపుగా చేసుకుంటూ.. అవసరమైన ఖర్చులు పెడుతూ ఉండాలి. మిగతా డబ్బులు రెట్టింపు చేసే ఆలోచనలు ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎప్పటికైనా ఉన్నత స్థాయిలో ఉండిపోతారు.