Traffic Lights: పట్టణాలు, నగరాల్లో ఉండేవారు రోడ్లపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని నగరాల్లో అయితే ఇది నరకంలా అనిపిస్తుంది. దీంతో చాలా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించడానికి ట్రాఫిక్ లైట్లు ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ లైట్స్ ఆధారంగానే వాహనాల రాకపోకలు ఉంటాయి. ట్రాఫిక్ లైట్స్ ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందని అనుకుంటారు. కానీ కొంతవరకు సమయం ఖర్చు అవుతుంది. మరికొంత ఇంధనం కూడా వృథా అవుతుంది. అయితే ఇంధనం సేవ్ చేయడానికి.. ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండడానికి ట్రాఫిక్ లైట్లు లేకపోతే కష్టమవుతుందని భావిస్తారు. కానీ ఈ నగరంలో మాత్రం ఎలాంటి ట్రాఫిక్ లైట్స్ లేకుండా ట్రాఫిక్ సమస్యలు ఉండవు. ఇంతకీ ఆ నగరం ఎక్కడుందో తెలుసా?
భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో కోచింగ్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరు గల కోట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అందుకే ఈ నగరానికి ఆ పేరు వచ్చింది. అయితే ఈ నగరం ఈ ప్రత్యేకతను కలిగి ఉండడమే కాకుండా ఒక్క ట్రాఫిక్ లైట్ కూడా లేని సిటీగా పేరు తెచ్చుకుంది. భారతదేశంలో ట్రాఫిక్ లైట్ లేని సిటీ అంటే కోట మాత్రమే. అయితే ఇక్కడ ఒక ట్రాఫిక్ లైట్ సిగ్నల్ లేకున్నా కూడా ఎక్కడా ట్రాఫిక్ సమస్య కనిపించదు. వాహనాల రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కోవు. అసలు ఇలా ట్రాఫిక్ లైట్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే?
కోట నగరంలో నిర్మించిన రోడ్ల నిర్మాణమే ట్రాఫిక్ లైట్ పెట్టకపోవడానికి కారణం. ఇక్కడ అర్బన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ అమలు చేసిన స్మార్ట్ టర్బన్ డిజైన్ తో వాహనాల రద్దీ ఎక్కడ కనిపించదు. సిటీ మొత్తం 12 ఫ్లైఓవర్లు.. బైపాస్ రోడ్లు.. అండర్ పాసులు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎవరికి వారు తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగిస్తూ ఉంటారు. ఈ సిటీలో జనసాంద్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలంతా ఒక్కచోడకు వచ్చే అవకాశం ఉండదు.
కోట సిటీకి ఈ ప్రత్యేకతలు మాత్రమే కాకుండా మరి నీ విశేషాలు ఉన్నాయి. ఇక్కడ పురాతన ప్యాలెస్ ఉంది. దీనిని తెల్లటి మార్పులతో నిర్మించారు. ఇందులో అద్దాలతో గోడలు నిర్మించారు. గార్డెన్ మధ్యలో ఉండే టీ పురాతన భవనం ఆకట్టుకుంటుంది. సిటీ మధ్యలో కిషోర్ సాగర్ అనే సరస్సు ఉంది. సరస్సు మధ్యలో ఐలాండ్ ఉంటుంది. చుట్టుపక్కల భవనాలు మధ్యలో సరస్సు ఉండడంతో ఇక్కడికి పర్యాటకులు విశేషంగా వస్తుంటారు. అలాగే ఈ సరస్సు ఒడ్డున ఐఫిల్ టవర్ వంటి ఆకృతులు ఆకట్టుకుంటాయి. కోట సిటీ సమీపంలో చంబల్ నది ఉంటుంది. ఈ నది వర్షాకాలంలో పొంగి పొల్లి ప్రవహిస్తుంది. సాయంత్రం గేట్లు తీసిన సమయంలో ఇక్కడి అందాలు ఆకట్టుకుంటాయి. ఇలా రాజస్థాన్లోని కోట నగరం అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది.