Australia vs Pakistan: క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాగా క్రికెట్ స్టేడియంలో చాలా అద్భుతాలు జరుగుతుంటాయి. అవన్నీ కూడా ఊహచనివే. ఎవరి ఊహలకు అందని ఘటనలు అన్నీ ఇక్కడ నిజం అవుతాయి. కాగా ఇప్పుడు కూడా ఇలాంటి ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. అది మన దేశంకు సంబంధించింది కాకపోయినా.. క్రికెట్ అభిమానులకు మాత్రం సూపర్ న్యూస్ అయింది.

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్, ప్రపంచ మెరుగైన బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్న మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియా వుమెన్స్ క్రికెట్ టీమ్ లో బ్యాట్స్ మెన్ అయిన అలిస్సా హేలీ ప్రేమించుకుని పెండ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు ఒకే సమయంలో ఒకే దేశంపై బ్యాటింగ్ చేయడం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు వారి ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం వుమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా.. అలిస్సా హేలీ పాకిస్థాన్ తో వన్డే మ్యాచ్ ఆడుతోంది. మౌంట్ మాంగనూయి వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆమె 72 రన్స్ తో దుమ్ము లేపుతోంది. కాగా ఈమె బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే పాకిస్థాన్ టూర్ లో ఉన్న ఆస్ట్రేలియా టీమ్ రావల్పిండిలో ఆఖరి టెస్టు మ్యాచ్‌ను ఆడుతోంది.

విచిత్రంగా.. అలిస్సా హేలీ బ్యాటింగ్‌కు దిగిన సమయంలోనే మిచెల్ స్టార్క్ కూడా ఎనిమిదో నెంబర్ బ్యాట్స్ మెన్ గా స్టేడియంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అంటే అటు భార్య, ఇటు భర్త ఒకే సమయంలో ఒకే దేశంపై బ్యాటింగ్ చేస్తున్నారన్న మాట. ఇంకేముంది వీరిద్దరి ఆటకు సంబందించిన ఫొటోలను అభిమానులు నెట్టింట్లో తెగ షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే వన్డే మ్యాచ్ లో వుమెన్స్ టీమ్ విజయం సాధించింది. అటు టెస్ట్ మ్యాచ్ లో మాత్రం డ్రా దిశగా ఆస్ట్రేలియా పయంన కొనసాగుతోంది.