Srikanth Sensational Comments: మైటీ స్టార్ శ్రీకాంత్ సినీ కెరీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కొట్టాడు. మైటీ స్టార్ గా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందాడు. వందలాది సినిమాల్లో నటించి మేటి నటుడిగా రాణిస్తూనే ఉన్నాడు.
అయితే మాస్ ఆడియెన్స్ ఆయనకు కనెక్ట్ కాకపోవడంతో.. సుదీర్ఘ కాలం హీరోగా కొనసాగలేకపోతున్నాడు. ఫ్యామిలీ టైమ్ సినిమాలతోనే ఆయన కెరీర్ ఎక్కువగా సాగిపోయింది. కాగా తనలోని నటనకు ఒక్క కేటగిరీ సరిపోదన్నట్టు.. ఆయన అన్ని రకాల పాత్రల్లోనూ పరకాయ ప్రవేశం చేసి నటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అఖండ మూవీతో కొత్తగా విలన్ పాత్రల్లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్.

కెరీర్ తొలినాళ్లలో కూడా శ్రీకాంత్ విలన్ పాత్రల్లో నటించాడు. అయితే త్వరలో మరిన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. ఆయన తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రామ్‌కు వచ్చాడు. ఇందులో భాగంగా ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టమైన ఘటనలను వివరించాడు. ఓ సారి అయితే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడంట.
Also Read: Ravi teja – Nikhil: రవితేజతో నిఖిల్.. హిట్ కొడతారా ?
తన చిన్న తనంలో అల్లరి బాగా చేసే వాడినని, ఓ సారి తాను చేసిన తప్పు తండ్రికి తెలిసిపోయిందంట. దీంతో ఇంటికి వెళ్తే తండ్రి కొడుతాడేమో అని భయంతోనే ఇంటికి వెళ్లాడు శ్రీకాంత్. కానీ తనను కొడితే మాత్రం చెరువులో దూకి చనిపోతానంటూ తండ్రికి వార్నింగ్ ఇచ్చానని తన చిన్న తనంలో చేసిన అల్లరి గురించి వివరించాడు శ్రీకాంత్. ఇలా ఎన్నో విషయాలను ఆలీతో పంచుకున్నాడు ఈ క్రేజీ హీరో. ఆయన కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. పెండ్లి సందఢీ మూవీతో హిట్ కూడా కొట్టాడు. అచ్చం శ్రీకాంత్ లాగే ఉన్నాడు రోషన్. త్వరలోనే కూతురు కూడా ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి.
Also Read: Pawan Kalyan: జనసేన బలోపేతానికి ఏం చేయాలి? ప్రజారాజ్యం నేతల వైపు పవన్ కల్యాణ్ చూపు?