Russia Ukraine war 2022: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం మొత్తం ప్రతిఫలం అనుభవిస్తోంది. ఫలితంగా యుద్ధం ప్రభావంతో అన్ని దేశాల్లో ధరలు పెరగనున్నాయి. దీంతో పేద దేశాలకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని రష్యా చర్యలను వ్యతిరేకిస్తున్నాయి. అయినా రష్యా మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్ని దేశాలు చెప్పినా పుతిన్ పెడచెవిన పెడుతున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధానికే కాలు దువ్వుతోంది.

పదమూడు రోజులుగా ఉక్రెయిన్ ను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. కానీ ఉక్రెయిన్ మాత్రం తగ్గడం లేదు. రష్యాకు తలొగ్గేది లేదని చెబుతోంది. ఇప్పటికే మొదటి విడత రెండు దేశాల మధ్య చర్చలు జరిగినా అవి ఫలితం తేల్చలేదు. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనిపై అమెరికా లాంటి అగ్ర దేశం కూడా రష్యా తీరును నిరసిస్తోంది.
Also Read: రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. ఈ వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశాలు?
తగిన ఫలితం అనుభవిస్తుందని హెచ్చరిస్తోంది. అయినప్పటికీ కూడా రష్యా తన వైఖరి మార్చడం లేదు. ఈ క్రమంలో రష్యాలో తమ సేవలను తొలగిస్తున్నట్లు పలు సంస్థలు హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. అంతర్జాతీయ సమాజంలో రష్యా ఏకాకిగా మిగిలిపోతోంది. రష్యాలో తమ బ్యాంకుల సేవలను కూడా నిలిపివేస్తున్నాయి.

ఈ క్రమంలో రష్యాలో అన్ని సేవలను రద్దు చేసినా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తగ్గడం లేదు. ఉక్రెయిన్ పై యుద్ధానికే రెడీ అని సెలవిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం విధిస్తున్న ఆంక్షలను సైతం లెక్కలోకి తీసుకోవడం లేదు. ప్రపంచమే కుదేలైపోతున్నా రష్యా పెడచెవిన పెడుతోంది. కానీ ఉక్రెయిన్ ను రష్యా మాత్రం విడిచిపెట్టడం లేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా దూకుడును నియంత్రించే చర్యల్లో భాగంగా అన్ని దేశాలు ముక్తకంఠంతో నివారిస్తున్నా రష్యా వినడం లేదు. ఫలితంగా యుద్ధ ప్రభావంతో అన్ని దేశాలు దాని చేదు ఫలితాలు అనుభవించాల్సి వస్తోంది.
Also Read: సభలో కేటీఆర్, ఈటల ఆలింగనం.. వైరల్ అవుతున్న వీడియో