midnight delivery : నేటి కాలంలో చాలామంది ఫుడ్ కోసం ఎక్కువగా యాప్స్ మీద ఆధారపడుతున్నారు. ఎక్కడ ఉన్నా సరే ఫుడ్ వస్తుంది కాబట్టి.. ఆర్డర్ పెట్టుకున్నారు. అయితే చాలావరకు సంస్థలు అర్ధరాత్రి వరకు కూడా ఫుడ్ సప్లై చేస్తున్నాయి. ఇలా ఫుడ్ సప్లై చేస్తున్న క్రమంలో డెలివరీ బాయ్ లు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఓ బాయ్ బాధ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో కాస్త సంచలనంగా మారింది.
ఇన్ స్టా గ్రామ్ లో కనిపిస్తున్న ఆ వీడియో సంచలనం రేకెత్తిస్తోంది. ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ బాయ్ కి ఆర్డర్ వచ్చింది. అతడు ఫుడ్ తీసుకుని లోకేషన్ వద్దకు వెళ్ళాడు. అప్పటికే సమయం అర్ధరాత్రి 1:00. అయినప్పటికీ అతడు ఆహారాన్ని సప్లై చేయడానికి కస్టమర్ కి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ నంబర్ కు కాల్ చేస్తే.. ఆ వ్యక్తి ఎత్తలేదు. ఉండిపోయాడు.
అప్పటికే సమయం అర్ధరాత్రి ఒంటి కావడంతో ఏం చేయాలో అతడికి పాలు పోలేదు. పైగా అతనికి ఆ సమయంలో తెల్లటి ఓ రూపం కనిపించింది. దీంతో డెలివరీ బాయ్ భయపడుతూ తిరుగు ప్రయాణమయ్యాడు. వాస్తవానికి ఇటువంటి సంఘటనలలో ఎంత పెద్ద ధైర్యవంతుడైనా సరే భయపడక తప్పదు. అలాంటి పరిస్థితే ఈ డెలివరీ బాయ్ కి కూడా ఎదురయింది.. దీంతో క్షేత్రస్థాయిలో డెలివరీ బాయ్ ల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఈ సంఘటన నిరూపించింది.
అర్ధరాత్రి పూట ఫుడ్ ఆర్డర్ పెట్టిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినట్టు.. డెలివరీ బాయ్ కదలికలను గమనిస్తున్నాడా.. నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి అతడు ఏం చేద్దాం అనుకున్నాడు.. ఇప్పుడు ఈ ప్రశ్నలే నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కొంతమంది దుర్మార్గులు ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా రకరకాల ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. కొందరైతే దాడులకు తెగబడి అందినంత కాడికి దోచుకుంటున్నారు. ఈ డెలివరీ బాయ్ మీద కూడా అదే స్థాయిలో దాడి చేసి దోచుకుందామని ఆ వ్యక్తి ప్లాన్ చేసి ఉంటాడని తెలుస్తోంది. అందువల్లే ఈ దుర్మార్గానికి ప్రణాళిక రూపొందించి ఉంటాడని సమాచారం.
View this post on Instagram