https://oktelugu.com/

Meditation: ధ్యానాల్లో ఇన్ని రకాలా.. ఇంతకీ ఏ ధ్యానం బెటర్?

సాధారణ మనుషులు అయితే ప్రతీ చిన్న విషయానికి బాధ పడటం, సంతోష పడటం వంటివి చేస్తారు. అదే మెడిటేషన్ చేసే వ్యక్తులు అయితే సంతోషం వచ్చినా, బాధ వచ్చినా కూడా అలానే ఉంటారు. ఏ మాత్రం కుంగిపోకుండా జీవితంలో ఇవన్నీ సహజమని భావిస్తారు. అయితే కొందరు ధ్యానం చేసేటప్పుడు సరైన భంగిమలో చేయరు. మరి ఏ భంగిమలో ధ్యానం చేయడం వల్ల దాని ఫలితం వస్తుందో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2024 / 02:37 AM IST

    Meditation

    Follow us on

    Meditation: మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఒత్తిడి లేకుండా ఉండాలంటే తప్పకుండా ధ్యానం చాలా ముఖ్యమైనది. ఏకాగ్రతతో రోజూ ధ్యానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ధ్యానం అనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. అయితే ప్రస్తుతం చాలా మంది డైలీ మెడిటేషన్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చాలా ప్రశాంతంగా ఉంటారని భావిస్తారు. ఎందుకంటే మెడిటేషన్ చేయడం వల్ల మెదడు మన కంట్రోల్‌లో ఉంటుంది. సాధారణ మనుషులు అయితే ప్రతీ చిన్న విషయానికి బాధ పడటం, సంతోష పడటం వంటివి చేస్తారు. అదే మెడిటేషన్ చేసే వ్యక్తులు అయితే సంతోషం వచ్చినా, బాధ వచ్చినా కూడా అలానే ఉంటారు. ఏ మాత్రం కుంగిపోకుండా జీవితంలో ఇవన్నీ సహజమని భావిస్తారు. అయితే కొందరు ధ్యానం చేసేటప్పుడు సరైన భంగిమలో చేయరు. మరి ఏ భంగిమలో ధ్యానం చేయడం వల్ల దాని ఫలితం వస్తుందో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

    మైండ్‌ఫుల్‌నెస్‌తో మెడిటేషన్
    కొందరు మనస్సులో ఏవేవో ఆలోచించుకుంటూ ధ్యానం చేస్తారు. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఫలితం ఉండదు. మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుకున్న తర్వాతే మెడిటేషన్ చేయాలి. అలాగే శ్వాస తీసుకుంటూ మెడిటేషన్ చేయాలి. ఇలా చేస్తే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు.

    కరుణతో ధ్యానం
    ఏ పని చేసిన కూడా ఇష్టంతో చేయాలి. కష్టంగా అయితే మాత్రం చేయకూడదు. మీరు ధ్యానం ఏదో చేయాలని అయిష్టంగా చేయకండి. ధ్యానం మీద ఉన్న ఇష్టంతో చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. ఆ ధ్యానం మీద మీకు ఒక గౌరవం ఉండాలి. ఉదాహరణకు రోజూ ఒకే సమయానికి కరుణతో ధ్యానం చేయాలి.

    ఏకాగ్రతతో ధ్యానం
    ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత అనేది తప్పనిసరి. మీరు ధ్యానం మాత్రం చేస్తుంటారు. కానీ మీ మనస్సు మాత్రం వేరే చోట ఉంటుంది. ఇలా కాకుండా ఉండకూడదంటే.. కళ్లు మూసుకుని మీకు కంఫార్ట్ ఉన్న భంగిమలో కూర్చోని ధ్యానం చేయాలి. కేవలం మీ శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉండాలి. ఇంకా వేరే దానిపై ధ్యాస ఉండకూడదు. ఏకాగ్రతతో ఇలా ధ్యానం చేయడం వల్ల మీరు చాలా స్ట్రాంగ్‌గా మారుతారు.

    జెన్ ధ్యానం
    జెన్ ధ్యానం అనేది బౌద్ధమతానికి సంబంధించినది. ఈ ధ్యానం చేసేటప్పుడు ఒకే ప్లేస్‌లో కదలకుండా కూర్చోని శ్వాసపై ధ్యాస పెట్టాలి. మీ శాస శరీరంలో ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇలా ధ్యానం చేయడం వల్ల మీకు బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయి.

    ప్రేమపూర్వకంగా ధ్యానం
    ప్రేమపూర్వక దయతో ధ్యానం చేయాలి. అంటే ఎవరి మీద కూడా కోపం, ద్వేషం వంటివి పెట్టుకోకుండా ఉంటామని భావిస్తూ ధ్యానం చేయాలి. కళ్లు మూసుకుని ధ్యానం చేసేటప్పుడు ఇలా అనుకుంటే మీకు ఎవరి మీద కూడా ఎలాంటి కోపం ఉండదు. అందరినీ కూడా ప్రేమతో చూస్తారు.

    మంత్ర ధ్యానం
    మనస్సు ఏకాగ్రతను పెంచడానికి ఈ మంత్ర ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ ధ్యానంలో మీరు ఏదో ఒక మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి. దీనివల్ల మీకు కొంత శక్తి లభిస్తుందట. అధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు ఎక్కువగా ఈ మంత్ర ధ్యానం చేస్తుంటారు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంతో పాటు అధ్యాత్మికంపై ఎక్కువగా దృష్టిని తీసుకెళ్లేలా చేస్తుంది. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోగలరు.