Anger : ముక్కు మీద కోపం చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వస్తుంటుంది. అయితే ప్రతి విషయానికి ఇర్రిటేట్ అయ్యేవారికి గ్యాస్ సమస్యలు, అల్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందట. అయితే నార్మల్ ల్ గా పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రతి రోజు రెండు నుంచి రెండున్నర లీటర్లు విడుదల అవుతుంది. కానీ కోపంతో ఉన్నప్పుడు మరో లీటర్ ఎక్కువగా విడుదల అవుతుందట. యాసిడ్ ఎక్కువగా విడుదల కావడం వల్ల పొట్టలోని ప్రేగులు ఎక్కువగా ఇర్రిటేట్ అవుతాయి. ఇలా కోపానికి గురైన వారిలో యాసిడ్ నుంచి రక్షణ కలిగించే జిగురు తగ్గిపోతుందట. జిగురు తగ్గడం వల్ల అల్సర్ ఎసిడిటీ వంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాము అనుకున్నా సరే మీకు కోపం ఎక్కువగా ఉంటే ఈ అల్సర్, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఆరోగ్యంతో పాటు ముక్కు మీదనే ఉండే కోపాన్ని కూడా తగ్గించుకోవాలి. మరి దీనికి కూడా కొన్ని టిప్స్ చూసేద్దాం. కోపం తెచ్చుకోవడం చాలా సులభమైన పనే కదా. కానీ మీరు ఆ కోపాన్ని సరైన వ్యక్తికి, సరైన సమయంలో, సరైన కారణంతో సరైన మార్గంలో చూపిస్తేనే మీ కోపానికి ఓ అర్థం ఉంటుంది. లేదంటే మీకు కూడా కొన్ని సార్లు వాల్యూ ఉండకపోవచ్చు. ఈ కోపం ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. కాబట్టి కోపాన్ని ఎదుర్కొనేటప్పుడు చాలా జాగ్రత్త . ప్రపంచంలోని 50 శాతానికి పైగా ప్రజలు వారి కోపాన్ని ఇతర వ్యక్తుల మీద కామన్ గా తీస్తుంటారు.
కోపం వల్ల అందరికీ నష్టమే. కోపం వచ్చిన వ్యక్తికి వీరి కోపానికి బలైన వారికి అందరికి కూడా ఈ కోపం చేటే అంటున్నారు నిపుణులు. కోపం ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కోపం ఎక్కువా రావడం వల్ల రక్తాన్ని పంప్ చేసే కండరాల సామర్థ్యం దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు. అధిక రక్తపోటు , గుండె జబ్బులు, గుండెపోటు వంటి సమస్యలకు దారి తీస్తుంది.
అందుకే ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీకు కోపం తెప్పించిన వ్యక్తి లేదా పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవాలి. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. మీకు కోపం వచ్చినప్పుడు, మీరు చాలా దూరం నడవండి. కాస్త వాక్ చేయడం మంచిది. కారు లేదా బైక్ డ్రైవ్ కి వెళ్ళండి. కుదరకపోతే వ్యాయామం చేసుకోండి. ఒక మంచి పుస్తకం చదవండి. లేదంటే మంచి సినిమా చూడండి. మీ మనసులో వచ్చే ఆలోచనలను డైరీలో రాయడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయండి. ఇలాంటి వాటి వల్ల మీ కోపం తగ్గిపోతుంది. మీరు కూడా రిలాక్స్ గా ఉంటారు.