Mayank Agarwal Sunrisers Hyderabad : క్రికెట్ అంటేనే ఇండియాలో ఒక క్రేజ్.. ఐపీఎల్ వచ్చిన నాటి నుఉంచి ఆ క్రేజ్ పీక్స్‌కు చేరింది. టెస్టులు, వన్డేల కన్నా.. ఐపీఎల్ చూడడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు క్రికెటర్ల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. తాజాగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది. ఇందులో టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ ధరకు తీసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీపడి మరీ సన్‌రైజర్స్.. మయాంక్‌ను రూ.8.25 కోట్లకు ఎంచుకుంది.
![]()
కెప్టెన్‌గా పనికొస్తాడనే..
మయాంక్ కోసం ఇంత భారీ ధర చెల్లించించడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే ప్రస్తుతం సన్ రెజర్స్ హైదరాబాద్ జట్టుకు సరైన నాయకుడు లేడు. బ్యాటర్లు కొరత ఉండటంతోపాటు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేయగల ఓపెనర్ అవసరం ఉంది. గత సీజన్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓపెనర్‌గా బరిలోకి దిగినా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఆ లోటు పూడ్చుకునేందుకే మయాంక్ జట్టును నడిపిస్తాడనే ధీమాతోనే ఇంత ధర పెట్టినట్లు తెలుస్తోంది.
కేన్ వైపు చూడని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం..
బేస్ ప్రైజ్‌కు లభించే అవకాశం ఉన్నా కేన్ మామ వైపు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చూడలేదు. దాంతో గుజరాత్ టైటాన్స్ కేన్ విలియమ్సన్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు తీసుకుంది. పూర్తిగా బ్యాటింగ్‌ను బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టిన సన్‌రైజర్స్.. అందుకు తగ్గట్లుగానే వేలంలో దూకుడు ప్రదర్శించింది. ఇంగ్లండ్ యువ బ్యాటర్ హరీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు వెచ్చించింది. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హరీ బ్రూక్, గ్లేన్ ఫిలిప్స్‌తో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ సాలిడ్‌గా ఉంది.
బౌలింగ్‌లోనూ పటిష్టం..
ప్రస్తుతం బ్యాటింగ్‌లో పటిష్టంగా కనిపిస్తున్న ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగంలోనూ పటిష్టంగానే ఉంది. భువనేశ్వర్‌కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్, కార్తీక్ త్యాగీలతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, ఆదిల్ రషీద్‌లతో ప్రతిభావంతమైన స్పిన్నర్లున్నారు. అయితే జట్టును నడిపించే ఆటగాడినే సన్ రైజర్స్ ఎంచుకోవాల్సి ఉంది. ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మలు కెప్టెన్సీ రేసులో ఉన్నారు.
అత్యంత సీనియర్ అయిన భువనేశ్వర్ కుమార్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని ఉన్నా అతని వయసు, ఫిట్‌నెస్ సమస్యలు ప్రతికూలంగా మారాయి. మరో విదేశీ ప్లేయర్‌కు కెప్టెన్సీ ఇచ్చే ఉద్దేశం సన్‌రైజర్స్‌కు లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎయిడెన్ మార్క్‌రమ్‌ను కూడా పక్కనపెట్టినట్లు సమాచారం. ఇక అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే చర్చ టీమ్ మేనేజ్‌మెంట్ చేసిందని, ఓనర్ కావ్యమారనన్, హెడ్ కోచ్ బ్రియాన్ లారా మయాంక్ అగర్వాల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అనుభవం ఉన్న నేపథ్యంలో అతనికే సారథ్య బాధ్యతలు ఇవ్వాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.