spot_img
Homeలైఫ్ స్టైల్Nirjala Ekadashi 2023: ఈ ఏకాదశి ఎంతో పవర్ ఫుల్.. పొరపాటును కూడా ఇలాంటి తప్పులు...

Nirjala Ekadashi 2023: ఈ ఏకాదశి ఎంతో పవర్ ఫుల్.. పొరపాటును కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు

Nirjala Ekadashi 2023: హిందూధర్మంలో ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. చాలా మంది ఈ రోజు ఉపవాసం చేస్తారు. నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో మరొకటి క్రిష్ణ పక్షంలో వస్తాయి. జ్యేష్ట మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటరు. ఇది మే 31న వస్తోంది. నిర్జల ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరిస్తే కష్టాలు తొలగిపోతాయి. నిర్జల ఏకాదశి రోజు పొరపాటున కూడా తులసి మొక్క వద్ద తప్పులు చేయకూడదని చెబుతారు.

ఈ రోజు లక్ష్మీదేవి ఉపవాసం చేస్తుందంటారు. అందుకే ఏకాదశి రోజు తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు. ఆకులు తెంచకూడదు. తులసి ఆకులు కావాలంటే అంతకు ముందు రోజు మాత్రమే తుంచుకోవాలి. కానీ ఏకాదశి రోజు వాటిని తెంపడం మంచిది కాదు. తులసి ఆకులను గోళ్లతో గిల్లడం పాపంగా పరిగణిస్తారు. ఆకులు తెంపే ముందు దానికి నమస్కరించి తుంచాలి.

ఎలా పడితే అలా తులసి ఆకులను తెంచకూడదు. చేతులు శుభ్రంగా ఉంటేనే చెట్టుపై చేయి వేయాలి. మురికి చేతులతో తాకితే అరిష్టమే. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర ఎలాంటి మురికి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

తులసి మొక్క దగ్గర చెప్పులు విప్పకూడదు. లక్ష్మీదేవికి ఇష్టంగా పవిత్రంగా భావించే తులసి మొక్కను ఈ రోజు బక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఈ రోజు తులసిని జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. తులసిని అత్యంత పవిత్రంా చూసుకుంటే అది మనకు లక్ కలిసేలా చేస్తుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
NEET Paper Leak

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...
Tech Mahindra Employee

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Oktelugu Epaper