Maruti Suzuki Ritz: అత్యధిక మంది కోరుకున్న ఈ కారు ధర కేవలం రూ.4 లక్షలు.. మరెందుకు బ్యాన్ చేశారు?

మారుతి నుంచి 2009లో రిలీజ్ అయంది రిట్జ్ (Ritz). విడుదలయిన కొత్తలోనే ఈ కారుకు ఆదరణ వచ్చింది. 2017 వరకు ఉన్న ఈ మోడల్ 4 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లను కలిగిన ఈ కారు స్విప్ట్ మాదిరిగానే ఉంటుంది.

Written By: Srinivas, Updated On : September 14, 2023 6:01 pm

Maruti Suzuki Ritz

Follow us on

Maruti Suzuki Ritz: దేశీయ మార్కెట్లలో Maruthi Suzuki కార్ల కంపెనీ అత్యధిక కార్లను విక్రయిస్తోంది. ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోది. ట్రెండ్ కు తగ్గట్లుగా అప్డేట్ అవుతూ అన్ని వర్గాల వారికి అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మారుతి సుజుకీ హవా చూపిస్తోంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఓ కారు ధర కేవలం రూ.4.48 లక్షలు మాత్రమే. కానీ ఇప్పుడీ కారు అందుబాటులో లేదు. దీని ఉత్పత్తులను కంపెనీ నిలిపివేసింది. ఇంతకీ ఈ కారును కంపెనీఎందుకు బ్యాన్ చేసింది? ఆ మోడల్ ఏంటి? వివరాల్లోకి వెళితే..

మారుతి నుంచి 2009లో రిలీజ్ అయంది రిట్జ్ (Ritz). విడుదలయిన కొత్తలోనే ఈ కారుకు ఆదరణ వచ్చింది. 2017 వరకు ఉన్న ఈ మోడల్ 4 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లను కలిగిన ఈ కారు స్విప్ట్ మాదిరిగానే ఉంటుంది. కానీ రిట్స్ కు ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి. భారత మార్కెట్లలో తనదైన ముద్ర వేసి ఇంటీరియర్స్, ప్రీమియం లుక్ ను కలిగి ఉంది. ప్రారంభంలో దీని విక్రయాలు గణనీయంగా పెరిగినా.. రాను రాను మిగతా మోడళ్లతో పోటీగా నిబడలేకపోయింది. కానీ కంపెనీకి గుర్తింపు ఇవ్వడంలో రిట్జ్ ప్రత్యేక పాత్ర పోషించింది.

రిట్స్ ఫీచర్స్ విషయానికొస్తే 1,2 లీటర్ పెట్రల్ ఇంజన్ ను కలిగి ఉంది. 1.3 లీటర్ డిజిల్ వెర్షన్ తో ఉంది. ఇందులో 5-స్పీడ్ ఇంజిన్లు, 4- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ జతచేయబడ్డాయి. డిజిల్ ఇంజిన్ 6 -స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. కారు డ్రైవర్ కు సైడ్ ఎయిర్ బ్యాగ్స్ సహా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సహా అనేక స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి. అయితే కొందరు దీనిని సిటీలో మాత్రమే కంపోర్టు అని భావించారు. కానీ లాంగ్ టూర్ వెళ్లేవారికి కూడా అనుగుణంగా ఉందని చెప్పారు.

2017 సంవత్సరంలో ఆటో మోబైల్ రంగంలో కొత్త మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో రిట్జ్ తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా దీనిన అప్ గ్రేడ్ చేయానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో దీని ఉత్పత్తిని నిలిపివేసింది. దీని స్తానంలో కంపెనీ ఇగ్నిస్ ను తీసుకొచ్చింది. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో అత్యంత ప్రజాదరణ పొందినా విక్రయాలు అనుకున్న రేంజ్ లో తెచ్చుకోలేకపోయింది. దీంతో ఈ కారు 2017 నుంచి ఉత్పత్తి ఆగిపోయింది.