Maruti Premium MPV: కారు కొనలానుకునేవారు ఇప్పుడంతా రిచ్ గా ఉండాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ధర ఎంత ఎక్కువైనా పర్వాలేదు అని ఆలోచిస్తున్నారు. కార్ల కంపెనీలు సైతం ఎక్కువగా SUV ల ఉత్పత్తికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. 7 సీటర్స్.. హైఫై ఇంజన్ తో పాటు రాయల్ రేంజ్ లో ఉన్న వెహికిల్స్ కొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి తీసుకురావడంతో వినియోదారులు వాటి కోసం ఎగబడుతున్నారు. ఈ తరుణంతో మారుతి సుజుకీ సైతం ఈ రేంజ్ లో ఓ మోడల్ ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. టయోటా నుంచి ఇప్పటికే నెంబర్ 1 ఉన్న ఇన్నోవాను క్రాస్ చేసేందుకు అదే మోడల్ లో మారుతి సుజుకి Premium MPVని త్వరలో లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన డిటేయిల్స్ ఇప్పటికే ఆన్లైన్లోపెట్టారు. వాటి వివరాలేంటో చూద్దాం.
టాయోటా ఇన్నోవాను క్రాస్ చేసేందుకు మారుతి ఇప్పటికే గ్రాండ్ విటారా ను రిలీజ్ చేసింది. ఇది టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మధ్య తేడాలున్నాయి. గ్రాండ్ విటారా రీజనరేటివ్ గ్రిల్ లైట్స్, బ్రాండ్ లోగోస్ ఉన్నాయి. అయితే Premium MPV మరింత హైటెక్ ఫీచర్లతో కూడుకొని ఉండే అవకాశం ఉంది. గ్రాండ్ విటారా మాదిరిగానే Premium MPV కూడా 5 డోర్స్ జిమ్నీలను కలిగి ఉంటుంది. ఇది జూలై 5న రిలీజ్ చేయొచ్చని అంటున్నారు. ఇక దీనిని నెక్సా షోరూం ద్వారా విక్రయించనున్నారు.
మారుతి Premium MPV 2.0 లీటర్ పెట్రోల్, 5వ జనరేషన్ షెవ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. 1998 సీసీ ఇంజన్, పెట్రోల్ ఫ్యూయల్ తో నడుస్తుంది. అయితే ఇంకా పూర్తి వివరాలు రిలీజ్ చేసే సమయానికి విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ మోడల్ ను రూ.19 లక్షలకు విక్రియంచనున్నట్లు ఆన్లైన్లో పేర్కొంది. ఇంజిన్ విషయానికొస్తే దాదాపు ఇన్నోవా హైక్రాస్ నే పోలి ఉంటుంది. మిగతా ఫీచర్లు కూడా వాటినే పోలి ఉంటాయని ఆటోమోబైల్ రంగంలో చర్చ సాగుతోంది.
అయితే Premium MPVని టయోటా ప్లాంట్ లోనే ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో టయోటా మోడల్ కు కొంచెం అటూ ఇటూగా అదే మోడల్ ఉంటుందని అం్టున్నారు. ప్రస్తుతం టాప్ ఎండ్ వెర్షన్ అమ్ముతున్నందున బుకింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. మారుతి సుజుకీ ఇప్పటి వరకు హైబ్రిడ్ రేంజ్ లో గ్రాండ్ విటారాను 2022 సెప్టెంబర్ లో విడుదల చేసింది. దీని ధర రూ.10.70 లక్షలు. కానీ Premium MPVని రూ.19 లక్షలకు నిర్ణయించడంతో దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మారుతి నుంచి రిలీజైన వ్యాగన్ ఆర్, స్విప్ట్ సక్సెస్ అయ్యియి. అయితే ఇప్పుడు హైబ్రిడ్ కారుతో కూడా తన ప్రభంజనాన్ని సృష్టించడానికి మారుతి తహతహలాడుతోంది. టాయోట ఇన్నోవాకు పోటీగా అదే మోడల్ లో రిలీజ్ చేస్తున్న దీనిపై నిర్వాహకులు హై ఎక్స్ పెక్టేషన్ పెట్టుకున్నారు. మరి ఇది ఏ రేంజ్ లో కారు ప్రియులను ఆకట్టుకుంటుందో చూడాలని ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.