Marriage Life Problems: ప్రేమ కొత్తగా చిగురిస్తున్నప్పుడు ప్రతిదానిలోనూ కొత్తగా, వింతగా, అందంగా ఉంటుంది. కానీ సంబంధం పెరుగుతున్నప్పుడు మరింత బలంగా మారుతున్నప్పుడు, కలిసి జీవించే బాధ్యతలు పెరిగేకొద్దీ, ఈ ప్రేమ మసకబారడం ప్రారంభమవుతుంది. EMIలు చెల్లించడం, పిల్లల ఫీజులు, ఖర్చులు, ఆహార మెనూ ఇలా చాలా వరకు టెన్షన్ లు మొదలు అవుతాయి. పెల్లికి ముందు లేని బాధ్యతలు పెళ్లి తర్వాత చాలా పెరుగుతాయి. ఇలా గృహ జీవితం క్రమంగా ప్రేమను అధిగమిస్తుంది. అంతేకాదు ఇంకా చాలా కారణాల వల్ల ఈ పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత తగ్గుతుంది. మరి ఆ కారణాలు ఏంటంటే?
పెళ్లి అనే బంధం తో జీవించడానికి సిద్ధం అవుతున్న ప్రతి జంటలకు ఈ ప్రేమ గురించి లోతుగా ఆలోచించాల్సి వస్తుంది. కలిసి జీవించడం అంటే వివాహం తర్వాత అంత సులభం కాదు. ప్రేమ చాలా వరకు తగ్గుతుంది. కాదు కాదు ప్రేమ ఉంటుంది కానీ బాధ్యతలు ఈ ప్రేమను వ్యక్తపరచడానికి సమయాన్ని ఇవ్వవు. కాస్త స్థలం కూడా తగ్గుతుంది. మీరు కలిసి జీవించడం ప్రారంభించినప్పుడు, ప్రేమ స్థానంలో EMIలు, పిల్లల ఫీజులు, ఫుడ్ మెనూలు, AC రిమోట్‌ల గురించి కూడా మాట్లాడుకోవాల్సి, కొన్ని సార్లు పోట్లాడుకోవాల్సి వస్తుంది.
Also Read: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు వివాదాస్పద వ్యాఖ్యలు!
ఎన్ని కష్టాలు వచ్చినా, ఒకరి గురించి ఒకరు కాస్త సమయం దొరికినప్పుడు అయినా ఆలోచిస్తూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటే ఈ గొడవ ఎక్కువ రాదు. కానీ పెళ్లికి ముందు ఉన్న ప్రేమ మాత్రం ఉండదు. కాదు సమయం ఉండదు. పెళ్లి అయిన తర్వాత ఒక సంవత్సరం వరకు కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ తర్వాతే కొత్త భయాలు, బాధ్యతలు మొదలు అవుతుంటాయి. అప్పుడు కాస్త సమయం డబ్బు, సంపాదన, ఇతర పనులకు వెచ్చించాల్సి వస్తుంది.
మీ రిలేషన్ పాడయ్యేంత ప్రేమను కూడా మీరు చూపించకుండా, దూరం పెడుతుంటే, దూరం అవుతుంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెల్లికి ముందులా లేదా పెళ్లి తర్వాత గడిపిన ఒక సంవత్సరం వంటి సమయం లేకున్నా వారి మీద ప్రేమ ఉందని అర్థం అయ్యేలా ఉండాల్సిందే. లేదంటే మీ జంట ఎక్కువ కాలం సంతోషంగా జీవించలేదు. అందుకే ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటిస్తూ ముందుకు కదలాలి. మరి అవేంటో కూడా చూసేయండి.
Also Read: ఆ కన్నడ బ్యూటీపై కన్నేసిన సుకుమార్..
మీ రోజువారీ బాధ్యతల నుంచి ఒకరికొకరు సమయం కేటాయించండి . కలిసి నడకకు వెళ్లడం లేదా ఎటువంటి కారణం లేకుండా ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తడం వంటి చిన్న విషయాలలో ప్రేమను కనుగొనండి . మరీ ముఖ్యంగా కమ్యూనికేషన్‌ను కొనసాగించండి. మీరు మీ భావాలను బహిరంగంగా పంచుకోవడం చాలా ముఖ్యం. సంబంధాన్ని ‘ ఆటో మోడ్’లో నడపనివ్వకండి . ప్రయత్నిస్తూ ఉండండి. కొంత స్థలం కూడా ఇవ్వండి. అన్ని సమయాలలో కలిసి ఉండవలసిన అవసరం లేదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.