spot_img
Homeలైఫ్ స్టైల్Zodiac Signs: మార్గశిరం... ఈ 5 రాశులకు అనుకూలం.. పెద్దమొత్తంలో లాభాలు..

Zodiac Signs: మార్గశిరం… ఈ 5 రాశులకు అనుకూలం.. పెద్దమొత్తంలో లాభాలు..

Zodiac Signs: పరమ పవిత్రమైన కార్తీక మాసం డిసెంబర్ 1 అమావాస్యతో ముగుస్తుంది. ఆ తరువాత మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో..మార్గశిరంలో కూడా కొన్ని రోజులు శుభదినాలు ఉండనున్నాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గోదా దేవి కల్యాణం ఈ మాసంలోనే నిర్వహిస్తారు. ఈ మాసంలో గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. వారు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా కొందరి ఇళ్లల్లో కుభేరుడు తిష్ట వేస్తారు. ధనం, సంతోషానికి అధిపతి అయిన కుభేరుడి అనుగ్రహం కోసం చాలా మంది ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే మార్గశిర మాసంలో ఈ ఐదు రాశుల వారికి అనుకోకుండా అదృష్టం వరించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం..

కర్కాటకరాశి:
మార్గశిర మాసంలో ఈ రాశి వారికి బాగా కలిసి రానుంది. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఏర్పడుతాయి. పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు లభిస్తాయి. వ్యాపారులు భారీగా లాభాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహానికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభరాశి:
ఈ రాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. వ్యాపారులకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి. ఉద్యోగులు కొత్త ఆదాయ మార్గాలను పొందుతారు. ఉన్నట్టుండి ప్రయాణాలుచేస్తారు. ఇవి లాభిస్తాయి. కొందరికి అనుకోని అదృష్టం కలగడంతో ఉల్లాసంగా ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త ప్రాజెక్టులు చేపడుతారు.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ మాసమంతా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. దీంతో ఊహించిన విధంగా డబ్బును పొందుతారు. వ్యాపారులు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు ఏ పని మొదలు పెట్టినా విజయం అవుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. బంధువుల నుంచి ధన సాయం అందుతుంది. విద్యార్థులు కెరీర్ పై తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి.

కన్యరాశి:
ఈ రాశి వారికి ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. వివాహం చేసుకోవాలని అనుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. ఏపని చేపట్టినా వెంటనే పూర్తి చేస్తారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.

మకర రాశి:
ఈ రాశి వారు లాటరీ వేస్తే ధనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులు పెద్ద ప్రాజెక్టులను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కుటుంబంలో ఓ వ్యక్తి వల్ల సంతోషంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్తారు. శుభ కార్యాల్లో పాల్గొనడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. తల్లదండ్రుల ఆశీర్వాదంతో కొత్త వ్యాపారాన్ని మొదలుపెడుతారు

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Divi Vadthya

Divi Vadthya: నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..

Divi Vadthya: ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో కొంతమంది యంగ్ హీరోయిన్లు అందాల ఆరబోతలతో యూత్ ని పిచ్చెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అయితే సబ్ స్క్రిప్షన్...
Naga Chaitanya

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...
Hardik Pandya

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...
Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
Oktelugu Epaper