Male Ear Piercing: హె డియర్స్. ఇప్పుడు మనం ఒక భలే ఇంట్రెస్ట్ టాపిక్ గురించి తెలుసుకుందామా? సాధారణంగా ఆడవాళ్లు చెవులు కుట్టించుకుంటారు. అదంతా బాల్యంలోనే జరుగుతుంది. తర్వాత కావాలి అంటే చెవిలోనే కాస్త పైకి మధ్యలో కూడా చెవి కుట్టించుకొని అలంకరించుకుంటారు. కానీ అబ్బాయిలకు కూడా ఈ చెవి పోగులు ఉంటాయి. ఇలాంటి వారిని మీరు చాలా మందినే చూసి ఉంటారు కదా. మరి ఎందుకు అబ్బాయిలు చెవులు కుట్టించుకుంటారు. దీని వెనుక కారణం ఏంటి? నిజంగా ఏదైనా ప్రయోజనాలు ఉంటాయా? లేదా అదొక స్టైల్ మాత్రమేనా అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందామా?
మహిళలే కాదండోయ్ పురుషులు కూడా చెవులు కుట్టించుకోవడం మంచిదట. చెడు దృష్టి నుంచి తప్పించుకోవచ్చట. అంతేకాదు బంగారం, రాగి వంటి చెవి పోగులు పెట్టుకుంటే ప్రతికూల శక్తి దూరంగా ఉంటుందట. అంటే అనారోగ్యం దరిచేరదు అన్నమాట. అనారోగ్యం ఉండదంటే ఆరోగ్యమే కదా ఇక. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఎడమ, కుడి వైపున చెవులు కుట్టించుకుంటే రాహువు, కేతువు ప్రతికూల ప్రభావాలు కూడా తగ్గుతాయి అంటోంది జ్యోతిష్య శాస్త్రం. ఏకంగా తొమ్మిది గ్రహాల స్థానం బలంగా మారుతుందట.
Also Read: AI Job Losses: సాఫ్ట్ వేర్ పని అయిపోయిందా?
రాహువు కేతులు బలంగా ఉంటే డబ్బుకు కొదువ ఉండదు. డబ్బు ఉంటే అటోమెటిక్ గా కాస్త గౌరవం కూడా పెరుగుతుంది కదా. ఇక మన శరీరంలో చాలా సున్నితమైన ప్రాంతం చెవి. అందుకే చెవులు కుట్టించుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందట. ఇక పురుషులకు ప్రతికూల ఆలోచనలు ఏమైనా తిరిగితే అవి కూడా మాయం అవుతాయట చెవి కొట్టిస్తే.. అంతేకాదండోయ్ చెవులు కుట్టించుకునే అబ్బాయిలు ధైర్యస్థులట. ఉత్సాహం వారికి రెట్టింపు కలుగుతుందట.
అంతేకాదు ఆధ్యాత్మిక వృద్ధి కూడా పెరుగుతుందట. పవిత్ర శబ్దాలు వింటారట. పాపాన్ని పక్కన పెట్టి ఆత్మ శుద్ది అవుతుంది అంటోంది జ్యోతిష్య శాస్త్రం. ముఖ్యంగా రాగి బంగారం పెట్టుకుంటే శరీర విద్యుత్ ప్రవాహం కూడా సులభం అవుతుందట. అయితే చెవికి బంగారాన్ని మాత్రమే పెట్టుకోవాలి అంటారు కొందరు. ఏది ఏమైనా సరే అబ్బాయిలు చెవులు కుట్టించుకుంటే కూడా మంచి జరుగుతుంది అంటున్నారు. కానీ అందరికీ ఇష్టం ఉండదు. సో మీ ఛాయిస్ అన్నమాట. నచ్చితే చెవి కుట్టించుకోవచ్చు. లేదా మీ ఇష్టం. ప్రయోజనాలు ఉన్నాయని ఇష్టం లేకున్నా కుట్టించుకుంటే ఇబ్బంది పడుతుంటారు కదా.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.