https://oktelugu.com/

Simbu: బోల్డ్ హీరోయిన్ తో పెళ్ళికి రెడీ అంటున్న హీరో !

Simbu:  కోలీవుడ్‌ హీరో శింబు కెరీర్ స్టార్టింగ్ లో పెద్ద స్టార్ హీరో అవుతాడు అనుకున్నారు. అయితే, శింబు మందు మత్తులో చిత్తు అయి సర్వస్వం కోల్పోయి ప్లాప్ ల వలయంలో చిక్కి చివరకు మార్కెట్ పూర్తిగా కోల్పోయాడు. దాంతో స్టార్ హీరోల్లో ముందు వరుసలో ఉండాల్సిన శింబు.. అసలు హీరోల లిస్ట్ లోనే లేకుండా పోయాడు. తాగుడుతో పాటు డ్రగ్స్ కి బానిసగా మారడం కూడా శింబు కెరీర్ కి పెద్ద మైనస్ అయింది. దాంతో […]

Written By:
  • Shiva
  • , Updated On : January 31, 2022 / 04:08 PM IST
    Follow us on

    Simbu:  కోలీవుడ్‌ హీరో శింబు కెరీర్ స్టార్టింగ్ లో పెద్ద స్టార్ హీరో అవుతాడు అనుకున్నారు. అయితే, శింబు మందు మత్తులో చిత్తు అయి సర్వస్వం కోల్పోయి ప్లాప్ ల వలయంలో చిక్కి చివరకు మార్కెట్ పూర్తిగా కోల్పోయాడు. దాంతో స్టార్ హీరోల్లో ముందు వరుసలో ఉండాల్సిన శింబు.. అసలు హీరోల లిస్ట్ లోనే లేకుండా పోయాడు. తాగుడుతో పాటు డ్రగ్స్ కి బానిసగా మారడం కూడా శింబు కెరీర్ కి పెద్ద మైనస్ అయింది.

    Simbu:

    దాంతో పాటు హీరోయిన్స్ తో రొమాన్స్ కూడా శింబుకి బ్యాడ్ నేమ్ ను తెచ్చి పెట్టింది. మొత్తమ్మీద శింబు సక్సెస్ ట్రాక్ తప్పి, పర్సనల్ లైఫ్ ను కూడా మిస్ లీడ్ చేసుకుని మొత్తానికి ఫేడ్ అవుట్ అయ్యాడు. కరెక్ట్ గా ఇలాంటి సమయంలోనే శింబు పడి లేచిన కెరటంలా లేచాడు. తనకు ఎదురైన ఆర్థిక కష్టాలు, అంతలో చుట్టూ ఉన్న జనం మాయం అవ్వడం, ఇక బంధువులు, సన్నిహితులు తమ గొప్పతనం కోసం శింబు స్థాయిని తగ్గించడం మొత్తానికి శింబులో కసి పెరిగింది.

    Also Read:  పవన్ కళ్యాణ్ ‘ఒంటరి’!.. ఎందుకిలా వదిలేశారు?

    సక్సెస్ లేకపోతే మనుషులు ఎలా ఉంటారో శింబుకి బాగా అర్థం అయింది. ఒకప్పుడు ఎప్పుడూ తాగుతూ తూగుతూ ఉండే శింబు.. ఆ వ్యసనాల వల్ల తన కెరీర్ నాశనం అవుతోందని గ్రహించాడు. అన్నీ మానేశాడు. ఏడాది పాటు కష్టపడి ఫిట్నెస్ సంపాదించుకుని.. స్లిమ్ గా తయారయి.. ‘మానాడు’ అనే సినిమా తో అదిరిపోయే హిట్ కొట్టాడు. దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత దక్కిన హిట్..

    Simbu:

    దెబ్బకు దశ తిరిగింది. ఇప్పుడు శింబు చుట్టూ నిర్మాతలు క్యూ కడుతున్నారు. కాగా త్వరలో తన పెళ్లిపై శింబు క్లారిటీ ఇవ్వనున్నాడు. ఈశ్వరన్‌ మూవీలో నటించిన హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ ను శింబు ప్రేమిస్తున్నారనే వార్తలు హల్చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల మూడో తేదీ శింబు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నాడు.

    ఆ రోజున తన అభిమానులు ఖుషి చేసేలా శింబు తన వివాహం గురించి ఒక నిర్ణయాన్ని వెల్లడించనున్నాడంటూ కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి శింబు. ఈజీగా పేరు వచ్చింది, పైగా కెరీర్ మొదట్లోనే మంచి హిట్లు వచ్చాయి. ఇటు తెలుగులోనూ ఫుల్ మార్కెట్ వచ్చింది. అన్ని పోయి.. మళ్ళీ మొదటి నుంచి కెరీర్ స్టార్ట్ చేసి హిట్ కొట్టాడు. త్వరలో ఓ ఇంటివాడు కూడా కాబోతున్నాడు.

    Also Read: రకుల్ పబ్లిక్ గా అడిగేసింది.. మేకర్స్ స్పందన ఏమిటి ?

    Tags