Mssc Scheme: మూడు నెలలకు ఒకసారి చక్రవడ్డీ కింద కలుపుతారు. ఈ విధంగా రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి మొత్తం కలిపి దాదాపు 16% వరకు లభిస్తుంది. సాధారణంగా బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఇతర ప్రభుత్వ పథకాలు అంటే 10 శాతం కంటే తక్కువ వడ్డీ ఇస్తారు. అంతకంటే ఎక్కువ శాతం వడ్డీ కావాలంటే రిస్కు తీసుకోవాల్సిందే. కానీ అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఒక అద్భుతమైన పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఆ పథకం పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. మహిళ సమాన్ సేవించి సర్టిఫికేట్ పథకంలో సంవత్సరానికి 7.5% వడ్డీ అందుతుంది. మూడు నెలలకు ఒకసారి దీన్ని చక్రవడ్డీ కింద కలుపుతారు. ఈ విధంగా చూసుకుంటే రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి 16% వరకు రిటర్న్స్ లభిస్తాయి. మహిళలకు ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే ఇతర చిన్న చిన్న సేవింగ్స్ పథకాలలో ఇంత ఎక్కువ రాబడి ఉండదు. ఈ పథకంలో మీరు రెండు లక్షలు పెట్టుబడి పెడితే రూ.2,32,044 అవుతుంది. అంటే రూ. 32,044 మీకు లాభం అందుతుంది. అదే లక్ష రూపాయలు కనుక పెడితే మెచ్యూరిటీ కి మీరు రు.1,16,022 పొందుతారు. అంటే రూ.16,022 వడ్డీ మీ యొక్క ఖాతాలలో జమ అవుతుంది.
కనీసం వెయ్యి రూపాయల వరకు ఈ స్కీమ్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పథకంలో 100 గుణిజాల్లో ఎంతైనా పెంచుకోవచ్చు. ఒక్కో ఎకౌంటు హోల్డర్ గరిష్టంగా 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఒక మహిళ లేదా బాలిక సంరక్షకుడు మొదటి అకౌంటు తెరిచిన మూడు నెలల తర్వాత రెండవ ఎకౌంట్ ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పథకం టెన్యూర్ రెండు సంవత్సరాలు.
మెచ్యూరిటీ పూర్తి అయిన తర్వాత మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు. అలాగే అలాగే ఈ పథకంలో ఎకౌంటు తెరిచిన ఒక ఏడాది తర్వాత 40 శాతం వరకు డబ్బులు మీరు విత్ డ్రా చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎకౌంటును ముందుగానే క్లోజ్ చేసే ఆప్షన్ కూడా ఈ పథకంలో ఉంటుంది. ఆరు నెలలు పూర్తయిన తర్వాత మీ డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కానీ ఆ సందర్భంలో వడ్డీ రేటు 5.5 శాతానికి తగ్గిపోతుంది.