Lunar Eclipse 2022: నవంబర్ 8న అంటే రేపు ఏర్పడబోయే చంద్ర గ్రహణం మధ్యాహ్నం 2.38 గంటలకు మొదలై సాయంత్రం 4.29 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో గ్రహణం ఏర్పడటంతో మనదేశంలో కనిపించదు. పాక్షికంగా కనిపిస్తుంది. దీంతో చంద్రగ్రహణం వల్ల కలిగే అనర్థాల గురించి పండితులు ఇప్పటికే సూచించారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. గ్రహణ ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. ఐదు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది. ఏ ఏ రాశుల వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై స్పష్టత ఇస్తున్నారు.

మేష రాశి వారికి ఈ గ్రహణం ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక ఇబ్బందులు భయపెడతాయి. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వైవాహిక బంధంలో విభేదాలు వస్తాయి. ఈ చెడు ప్రభావాల నుంచి విముక్తి కావాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వ్యాపారాల్లో నష్టాలు ఎదుర్కొంటారు. దీంతో ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలే కలుగుతాయి. దీంతో గ్రహణం సందర్భంగా ఈ రాశి వారు రాబోయే ముప్పులను తొలగించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
వృషభ రాశి వారికి కూడా చంద్రగ్రహణం ఇబ్బందులు సృష్టిస్తుంది. ప్రతికూల ప్రభావాలు తెస్తుంది. అన్నదమ్ముల మధ్య మనస్పర్దలు వచ్చే సూచనలున్నాయి. నిద్రలేమి సమస్యలు కలవరపెడతాయి. అనారోగ్యాల బారిన పడే వీలుంది. వైవాహిక సంబంధంలో ఎన్నో మార్పులు వచ్చే అవకాశముంది. వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు రావు. దీంతో ఎదురయ్యే ఇబ్బందుల గురించి పట్టించుకుని వాటి నుంచి తప్పించుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిందే.

వృశ్చిక రాశి వారికి కూడా ఇబ్బందులు రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు వస్తాయి. కొత్త సవాళ్లు ఇబ్బందులు పెడతాయి. ఆరోగ్యం కోసం చర్యలు పాటించాలి. తుల రాశి వారికి కూడా ఇబ్బందులే. వృత్తి, వ్యాపారాల్లో చిరాకులు, ఉద్యోగాల్లో సమస్యలు చుట్టుముడతాయి. వివాహం, ప్రేమ వంటి వాటిల్లో టెన్షన్ ఉంటుంది. కడుపు, కాళ్లకు సంబంధించిన అనారోగ్యాలు బాధిస్తాయి. ఇంకా కన్యా రాశి వారికి కూడా సమస్యలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవు. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. చంద్ర గ్రహణం విషయంలో పై రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందేనని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.