Love: జీవితంలో ప్రేమకున్న విలువ అందరికి తెలిసిందే. ప్రేమించని వాడుండడు. ప్రేమ చిగురించని మనసుండదు. అలాంటి ప్రేమను వ్యక్తం చేయడం ఓ కళ. దానికి ఎంతో శక్తి ఉంటుంది. ప్రేమలో ఉన్న వాడికి ఏది కనిపించదు ఒక ప్రేమ తప్ప. అలాంటి ప్రేమను తెలియజేయడం కూడా ఓ విధంగా అద్భుతమే. అలాంటి ప్రేమను రకరకాలుగా చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ జంట తమ ప్రేమకు స్టేడియమే వేదికగా చేసుకుని ప్రేక్షకులను సాక్షిగా చేసుకుని రెచ్చిపోయారు. అది సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ అవుతోంది.

ప్రేమించడానికి హృదయం కావాలి. ప్రేమించబడటానికి అదృష్టం ఉండాలి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న బ్రిస్బేన్ లో ని గబ్బా స్టేడియంలో ఓ వింత జరిగింది. ఆటను వీక్షిస్తున్న ప్రేక్షకులు ప్రేమికులను ప్రోత్సహించారు. దీంతో స్టేడియం కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. ప్రేమికులకు మద్దతుగా అందరు నిలబడ్డారు. వారి ప్రేమకు సమ్మతి తెలిపారు.
Also Read: మెగా వేలంలోకి ‘కీ’ ప్లేయర్స్.. వీరంతా ఒకే జట్టులో ఉంటేనా?
ప్రత్యర్థి జట్ల అభిమానులైన ఇద్దరు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి స్టేడియమే వేదికగా అనుకున్నారు. దీంతో అనుకున్నదే తడవుగా అతడు ఆమెకు తన మనసులోని మాట వ్యక్తం చేశారు. దానికి ఆమె ఐదు నిమిషాలు ఆలోచించి ఓకే చెప్పింది. తనను పెళ్లి చేసుకుంటావా? అని అతడు అడగడంతో ఆమె తన సమ్మతి తెలియజేయడంతో అతడు ఆమెను ముద్దాడాడు. దీంతో ప్రేక్షకుల చప్పట్లతో హోరెత్తించారు.
దీంతో ఇద్దరు కౌగిలించుకోవడంతో కెమెరాలు ఒక్కసారిగా వారి వైపు తిరిగాయి. దీంతో విషయం కాస్త వైరల్ అయింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మైఖేల్ అనే యువకుడు మోకాళ్లపై కూర్చుని టోరీ అనే యువతికి ప్రేమను వ్యక్తం చేశాడు. దీంతో వారిద్దరి ప్రేమను అందరు ఉత్సాహపరచారు. వారి చుట్టు ఉన్న అభిమానులు కేరింతలతో హోరెత్తించారు.
Also Read: పిల్లలకూ కరోనా ‘ఒమిక్రాన్’ వ్యాప్తి