Lord Shiva Daughters: శివపార్వతులను ఆదిదేవుళ్లుగా కొలుస్తాం. ప్రతీ సోమవారం శివునిని ఆరాదిస్తాం.. శివరాత్రి రోజు జాగారాలు ఉంటాం.. శివమాల వేస్తుంటారు.. దేశంలో శివునిని వివిధ పేర్లతో పిలుస్తారు. కానీ ఆయనది ఒకటే రూపం. లింగరూపం. శివుని గురించి అనేక కథనాలు ఉన్నాయి. భోళా శంకరుడు అని.. రుద్రుడు అని.. మిగతా దేవళ్ల కంటే శివునిని మాత్రమే ఆది దంపతులు అని పిలుస్తారు. ఎందుకంటే శివునికి గణేశుడు, కుమార స్వామి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మిగతా వారికి సంతానం ఉన్నట్లు ఎక్కువగా చెప్పబడలేదు. ఈ తరుణంలో అసలు శివునికి ఇద్దరు కుమారులు కాదని, ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. వాటిలో ‘పద్మ పురాణం’ ఒకటి. పద్మ పురాణంలో శివుని గురించి ఏం చెప్పారో చూద్దాం.
శివ పార్వతులకు అసలైన సంతానం వినాయకుడు, కుమారస్వామిగా చెబుతారు. అయితే అయ్యప్పస్వామి వరం వల్ల జన్మించిన పుత్రుడిగా పేర్కొంటారు. కానీ ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, వీరికి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పద్మ పురాణం ప్రకారం.. శివునికి అశోక సుందరి, జ్యోతి, మానన అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరు శివుని అనుగ్రహం వల్ల జన్మించారని తెలుస్తోంది.
అశోకసుందరి శివుని మొదటి కుమార్తె. ఈమెను పార్వతి సృష్టించిందని చెబుతున్నారు. తన ఒంటరి తనాన్ని తగ్గించుకోవడానికి అశోక సుందరిని పుట్టించిందని అంటున్నారు. మరో కథనం ప్రకారం దు:ఖాన్ని పొగొట్టేందుకు అశోక సుందరిని సృష్టించారని అంటున్నారు. అశోక సుందరి దేవిని ఆరాధిస్తే దు:ఖాలు తొలిగిపోతున్నాయని అంటున్నారు. శివుని రెండో కుమార్తె జ్యోతి. ఈమెను జ్వాలాముఖి అని కూడా పిలుస్తారు. అయితే ఈమె జన్మపై రకరకాల కథనాలు ఉన్నాయి. కొందరు ఆధ్యాత్మిక వాదులు శివుని కాంతి నుంచి ఈమె పుట్టిందని అంటున్నారు. మరికొందరు మాత్రం పార్వతీ దేవి తన నుదుటి నుంచి ఉద్భవించిందని చెబుతారు.
ఇక శివుని చివరి కుమార్తె మానస గా చెబుతున్నారు. అయితే మిగతా ఇద్దరి కంటే ఈమెను ప్రత్యేకంగా చెబుతున్నారు. శివుని అనుగ్రహంతో ఈమె జన్మించిందని అంటున్నారు. మానసదేవిని బెంగాల్ దేవాలయంలో ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే ఈమెకు విగ్రహం అంటూ లేదు. మట్టి పాము లేదా మట్టి కుండ లేదా చెట్టుకొమ్మను మానస దేవిగా పూజిస్తారు. చికెన్ పాక్స్, పాముకాటు గురైన వారిని నుంచి ఈ దేవి కాపాడుతుందని నమ్ముతారు.