Loan Tips for Beginners: జీవితం నడవడానికి డబ్బు తప్పనిసరి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో విధంగా డబ్బులు లేనిదే ఏ పని ముందటికి సాగదు. అయితే డబ్బు అందరికీ ఒకేలా ఉండదు. కొందరి వద్ద ఎక్కువగానూ.. మరికొందరి వద్ద తక్కువగాను ఉంటుంది. వివిధ అవసరాల కోసం.. వస్తువుల కోసం వచ్చే ఆదాయం కొంతమందికి సరిపోదు. ఈ క్రమంలో తమ అవసరాలు తీసుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. అయితే కొందరు దీనిని ఆసరాగా తీసుకొని వ్యసనాలకు కూడా అప్పులు చేస్తుంటారు. కానీ అప్పు చేసే ముందు ఒకే ఒక్క విషయం ఆలోచిస్తే.. దానిని తీర్చేటప్పుడు కూడా ఇలాంటి బాధ ఉండదు అని కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఇంతకీ అప్పు తీసుకునేటప్పుడు ఎలాంటి విషయాలు ఆలోచించాలి?
అప్పు చేయడం ద్వారా కొన్ని కొన్ని అవసరాలను ముందే తీర్చుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తుకు అవసరమయ్యే కొన్ని పనులను పూర్తి చేసుకోవచ్చు. ఒకప్పుడు అప్పు కోసం ఇతరుల వద్ద చేయి చాచేవారు. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డులతో పాటు.. బ్యాంకుల ద్వారా కావలసినంత అప్పు దొరుకుతుంది. అయితే అప్పు చేసే ముందు ఒక విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అప్పు ఎందుకు చేస్తున్నామో ముందు పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వాహనాన్ని కొనుగోలు చేయడానికి అప్పు చేయాల్సి వస్తే.. అది ఎంత అవసరమో ముందు గుర్తుంచుకోవాలి. ఈ అప్పుతోని వాహనాన్ని కొనుగోలు చేస్తే దాని ద్వారా ఆదాయం వస్తే ఎలాంటి సమస్య ఉండదు. అలాకాకుండా కేవలం విలాసాల కోసమే అధికంగా ఖర్చుపెట్టి వాహనం కొనుగోలు చేస్తే మాత్రం అది అనవసరపు అప్పు అని తెలుసుకోవాలి. ఇలాంటి విషయంలో అప్పు చేయకుండా ఉంటేనే బెటర్.
Also Read: Borrowers: అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడం లేదా? ఇలా చేయండి ..
మరికొందరు కేవలం జల్సాల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. అయితే అప్పు చేసేటప్పుడు ఎవరైనా గౌరవం ఇస్తారు. తీసుకునే వారు సైతం మర్యాదపూర్వకంగా మాట్లాడుతారు. కానీ అప్పు తీర్చేటప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అప్పు తీసుకున్న చేయి తిరిగి ఇవ్వడానికి ఏమాత్రం అంగీకరించదు. ఎందుకంటే తీసుకున్న అప్పు ఉపయోగపడితేనే తిరిగి చెల్లించడానికి మనసు ఒప్పుకుంటుంది. అలాకాకుండా ఆ అప్పు వృధాగా మారితే తిరిగి ఇవ్వడానికి మనసు ఒప్పుకోదు. అలాంటప్పుడు అప్పు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అంతేకాకుండా అత్యవసరం అయితే తప్ప అనవసరపు అవసరాలకు పప్పు చేయకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తున్నారు. అయితే గడువులోగా బిల్లులు చెల్లించకపోతే వడ్డీ భారం మీద పడి మరిన్ని ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయని విషయాన్ని ముందే గ్రహించాలి. ఈ విషయాన్ని ముందే తెలుసుకుంటే ఆ తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇంకోదరు బ్యాంకు ద్వారా అధికంగా రుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే రుణాలు తీసుకునే సమయంలో వడ్డీ విషయాన్ని బాగా ఆలోచించాలి. ఎక్కువ వడ్డీకి బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాల్సిన అవసరం లేదు. అత్యవసరమైతే తప్ప ఇలాంటి రుణాల జోలికి వెళ్లకూడదు.